Site icon vidhaatha

Posani Krishna Murali: నటుడు పోసానికి బిగ్ షాక్ !

Posani Krishna Murali:

విధాత: నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) కి కోర్టులో బిగ్ షాక్ ఎదురైంది. విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు పోసానికి ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగించింది. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పీటీ వారెంట్ పై కర్నూల్ జైలులో ఉన్న పోసానిని కోర్టులో హాజరుపరిచారు.

తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ఒకే విధమైన కేసుతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో బాధ పడుతున్నానని న్యాయమూర్తికి పోసాని విన్నవించారు. గుండెజబ్బు, పక్షవాతం లాంటి జబ్బులు ఉన్నాయని పేర్కొన్నారు. పోసాని (Posani Krishna Murali) వాదన విన్న అనంతరం కోర్టు ఆయనకు ఈ నెల 20వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను తిరిగి కర్నూలు జైలుకు తరలించారు.

Exit mobile version