Site icon vidhaatha

D Arvind Kumar | వారిని రప్పా రప్పా జైల్లో వేయాలి.. హరీశ్‌ తప్ప సిట్టింగ్‌లు అంతా ఓడిపోతారు: బీజేపీ ఎంపీ అర్వింద్ కుమార్

D Arvind Kumar | కాళేశ్వరం, లిక్కర్ స్కామ్, విద్యుత్తు స్కామ్, పార్ములా ఈ కారు రేస్, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ లలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైలులో వెయ్యాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. అప్పుడే మరిన్ని స్కామ్‌లు బయటపడుతాయని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ రప్పా రప్పా 3.0లోడింగ్ అంటూ ఫ్లెక్సీలతో చేస్తున్న హల్చల్ ను అర్వింద్ కుమార్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు తిప్పికొడితే మూడు సీట్లు కూడా రావన్నారు. బీఆర్ఎస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో హరీష్ రావు తప్ప వాళ్ల దాంట్లో ఎవరూ గెలవరన్నారు. సిద్దిపేట దాటితే హరీష్ రావుకు కూడా పెద్ద ఏం ఉండదన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ను కూడా సులభంగా ఓడిస్తామని చెప్పారు. కేసీఆర్ అయితే పోటీ కూడా చేయడన్నారు. నిజమాబాద్ నుంచి రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పించకపోవడం సరైంది కాదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వారిని జైలులోకి పంపకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం కాక తప్పదన్నారు. పొద్దున కేసులు తెరిచి..సాయంత్రం సంచులు తెచ్చుకోవడం రేవంత్ రెడ్డి మానుకోకపోతే ఆయనకే నష్టమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా అధ్వాన్నంగా మరో ప్రాజెక్టు లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్టీ లీగల్ సెల్ ద్వారా కోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ చేపట్టాలని మేం మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని, బండి సంజయ్ లను కోరడం జరిగిందన్నారు. ఈనెల 29న జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారని ఇది పసుపు రైతులకు నూతన శకమన్నారు. ఈ సందర్భంగా నిజమాబాద్ లో నిర్వహించే రైతుల సభలో అమిత్ షా మాట్లాడుతారన్నారు. అదే రోజున మాజీ మంత్రి డీ. శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేస్తారని అర్వింద్ తెలిపారు. నిజమాబాద్ జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు సాధిస్తూ పలు పనులు చేపడుతామని తెలిపారు.

Exit mobile version