విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఐఏఎస్ ఐఏఎస్ అరవింద్ కుమార్ గురువారం మూడోసారి ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల బదలాయింపులు అరవింద్ కుమార్ పాత్ర కీలకం కావడంతో ఏసీబీ ఆయనను మరోసారి విచారిస్తుంది. కేబినెట్ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ రేసు కార్ సంస్థకు నిధులను బదలాయించినట్లుగా ఏసీబీ కేసులో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో అప్పటి మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ రెండు సార్లు విచారించింది.
రెండోసారి విచారణ సందర్భంగా కేటీఆర్ వెల్లడించిన అంశాల ఆధారంగా ఈ రోజు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ ప్రశ్నిస్తుంది. ఆ తర్వాతా అరవింద్ కుమార్ ను, కేటీఆర్ ను కలిపి ప్రశ్నించే అవకాశముంది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్-ఏ1, ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్‌ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అటు ఇదే కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ కూడా ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి.. జనవరిలో కేటీఆర్ సహా నిందితులను విచారణ చేసింది.