ACB | ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డీఈ

అవినీతి అధికారులను పట్టుకోవడంలో ఏసీబీ అధికారులు దూసుకెళ్తున్నారు. రోజురోజుకు లంచాధికారుల ఆటకట్టిస్తున్నా కొందరు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. లంచాలకు మరిగిన అవినీతి చేపలు ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.

విధాత, వరంగల్ :

అవినీతి అధికారులను పట్టుకోవడంలో ఏసీబీ అధికారులు దూసుకెళ్తున్నారు. రోజురోజుకు లంచాధికారుల ఆటకట్టిస్తున్నా కొందరు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. లంచాలకు మరిగిన అవినీతి చేపలు ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు వల వేసీ పట్టుకుంటున్నారు. తాజాగా, జనగామ జిల్లా పాలకుర్తి మండల మిషన్ భగీరథ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

పాలకుర్తి కి చెందిన ఓ కాంట్రాక్టర్ దగ్గర నుండి చేసిన పని బిల్లులు క్లియరెన్స్ కోసం మిషన్ భగీరథ డీఈ లంచం డిమాండ్ చేసింది. ఈ క్రమంలో పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా చేసిన పనికి బిల్లులు చేయమని అడుగగా ప్రతిసారి దాటవేస్తూ పలుమార్లు డబ్బులు తీసుకుందని, మరల ఒకసారి డబ్బులు అడగగా విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు తెలిపారు. ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో అవినీతి అధికారిని పట్టుకున్నారు.

Latest News