Manchiryala
విధాత: మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించి ఈ మధ్య కాలంలో పెద్దపల్లి జిల్లా రామగుండంకు బదిలీపై వెళ్లిన షఫీద్దీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని సహకారంతో టైపిస్టు రాజనర్సు ద్వారా 10,000 రూపాయల లంచం తీసుకున్నాడు.
బాధితులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నెలసరి అద్దెపై కారు నడిపిస్తున్నాడు. కారు 5 నెలల అద్దె బిల్లు కోసం యజమాని ఆఫీసు చుట్టూ తిరిగిన నేపథ్యంలో బిల్లు ఇవ్వడానికి 10000 లంచం డిమాండ్ చేయడంతో గత్యంతరం లేక బాధితుడు ఇవ్వదానికి ఒప్పుకున్నాడు.
బిల్లు మంజూరు చేసిన నేపథ్యంలో బదిలీ అయిన అధికారి ఔట్సోర్సింగ్ ఉద్యోగితో ఫోన్ చేయించి బాధితుడిని డబ్బులు అడిగాడు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో ఆఫీస్ కార్యాలయంలో రాజనర్స్ అనే ఉద్యోగికి డబ్బులు ఇస్తున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు.
అక్కడే మాటు వేసిన ఏసిబి అధికారులు డబ్బులు తీసుకున్న రాజనర్స్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ షఫీ ఉద్దీన్, మరొకరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, అధికారులు పాల్గొన్నారు.