విధాత:స్పెషాలిటీ బయోఫార్మాస్యూటికల్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సెలాన్ ల్యాబొరేటరీస్ బ్లాక్ ఫంగస్‌కు (మ్యుకోర్‌మైకోసిస్) ప్రత్యామ్నాయ ఔషధాన్ని తయారు చేసింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే లిపోసోమాల్ యాంఫోటెరిసిన్-బి ఔషధానికి కొరత ఉన్న నేపథ్యంలో.. ఎమల్షన్ ఆధారిత యాంఫోటెరిసిన్-బి ఫార్ములేషన్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 10,000 వయల్స్ తయారు చేయగల సామర్థ్యం ఉందని సంస్థ వెల్లడించింది. వీటితో నెలకు 6,000 మంది రోగులకు ఉపశమనం కలుగుతుందని వివరించింది.
మూడు వారాల్లోనే కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి బృందం దీనికి రూపకల్పన చేసిందని సెలాన్ ల్యాబ్స్ ఎండీ ఎం.నగేశ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు
2013 నుంచి లిపోసోమాల్ యాంఫోటెరిసిన్-బి తయారు చేస్తున్నామని, అయితే ఈ ఔషధం తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థం లిపాయిడ్స్ లభించకపోవడంతో డిమాండ్‌ను చేరుకోలేకపోయామని కంపెనీ తెలిపింది. లిపాయిడ్స్‌ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సెలాన్‌ను లండన్‌కు చెందిన కెలిక్స్ బయో ప్రమోట్ చేస్తోంది.
బ్లాక్ ఫంగసు హైదరాబాద్ సెలాన్ ఔషధం
<p> విధాత:స్పెషాలిటీ బయోఫార్మాస్యూటికల్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సెలాన్ ల్యాబొరేటరీస్ బ్లాక్ ఫంగస్‌కు (మ్యుకోర్‌మైకోసిస్) ప్రత్యామ్నాయ ఔషధాన్ని తయారు చేసింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే లిపోసోమాల్ యాంఫోటెరిసిన్-బి ఔషధానికి కొరత ఉన్న నేపథ్యంలో.. ఎమల్షన్ ఆధారిత యాంఫోటెరిసిన్-బి ఫార్ములేషన్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 10,000 వయల్స్ తయారు చేయగల సామర్థ్యం ఉందని సంస్థ వెల్లడించింది. వీటితో నెలకు 6,000 మంది రోగులకు ఉపశమనం కలుగుతుందని వివరించింది.మూడు వారాల్లోనే కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి బృందం […]</p>
Latest News

ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా
ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడుల జోరు
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు హత్యల కలకలం
ఆట పాటల్లో ఇండిగో సిబ్బంది వీడియో వైరల్
‘అఖండ 2’ విడుదల తేదిపై క్లారిటీ…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ నాగార్జున సాగర్
అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం