Chevella Road Accident | సోమవారం ఉదయం చేవెళ్ల సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వీరిని తాండూరుకు చెందినవారు. నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయి ప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ)గా గుర్తించారు. వారు మొత్తం నలుగురు అక్క చెల్లెళ్లు. పెద్దక్క పెళ్లి ఇటీవలే వివాహం అయ్యింది. బంధువుల ఇంట్లో పెళ్లికోసం ఇటీవలే ముగ్గురూ హైదరాబాద్ నుంచి సొంతవూరుకు వచ్చారు. హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్మూ దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ వద్ద బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం.. మరి కొంతమంది గాయపడడం చాలా దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు .
