Site icon vidhaatha

స్వర్ణ పతక విజేత చలాది సతీష్ కు వెల్లువలా అభినందనలు !

విధాత‌: కేంద్ర ప్రభుత్వ యువజన సేవలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ,ఒలింపిక్స్ కమిటీ ల గుర్తిపు కలిగిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ ఏ కె ఓ) ఇండియా ఆధ్వర్యంలో ఆగస్టు 26 నుండి 29 వరకు జరిగిన జాతీయ పోటీలలో మచిలీపట్నం కి చెందిన చలాది సతీష్ 74 కె.జి ల లైట్ కిక్ బాక్సింగ్ కేటగిరి లో స్వర్ణ పతకం,74 కె.జి లలైట్ కాంటాక్ట్ కేటగిరీలో రజత పతకం సాధించి జాతీయ స్థాయిలో విజయం సాధించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సతీష్ ని అభినందిస్తూ సందేశం పంపారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విభాగం అధిపతి ప్రో.బాబీ వర్ధన్ తన సందేశంలో తమ విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థి సతీష్ జాతీయ స్థాయిలో ఈ స్వర్ణ పతకం సాధించటం విశ్వ విద్యాలయనికి,తనకు ఎంతో గౌరవం అని తన సందేశంలో పేర్కొన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కె గుప్తా,భారత ప్రభుత్వ సమాచార శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ డి.మురళీమోహన్, హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధికారి సురేష్ ధర్మవరపు, విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ విభాగం అధిపతి డా.జి.కొండలరావు, అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ తెలుగులోగిలి అధ్యక్షులు డా.పి.ఎస్.రావు లతో పాటు పలువురు అధికార అనధికారులు,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు జర్నలిస్టులు సతీష్ ని అభినందించారు.

ఈ సందర్భంగా స్వర్ణ పతక విజేత సతీష్ తన విజయానికి బెంగళూరు లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏయిట్ లంబ్స్ మాస్టర్స్ వినోద్ రెడ్డి,పునీత్ రెడ్డి ల నేతృత్వంలో పొందిన శిక్షణ,వారి సలహాలు,మెలకువలు ఎంతో స్ఫూర్తి ఇచ్చాయన్నారు. ఈనెల 29 న సాధించిన తన విజయాన్ని ఆరోజే జరుపుకున్న తెలుగు మాతృభాష దినోత్సవం,జాతీయ క్రీడల దినోత్సవం సందర్భముగా ఉభయ తెలుగురాష్ట్రాలు,కర్ణాటక రాష్ట్ర ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించి సతీష్ మాతృ భాష పై తనకున్న అభిమానం చాటుకున్నారు.

Exit mobile version