జగన్ క్యాంపు కార్యాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

విధాత,అమరావతి : తాడేపల్లి‌లోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి సమీపంలో భరతమాత విగ్రహం వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన నరేష్, సరస్వతి దంపతులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్‌ను కలవాలని సెక్యురిటీ సిబ్బందిని దంపతులు కోరారు. అయితే కొవిడ్ కారణంగా కలవడం కుదరదని చెక్ పోస్టు సిబ్బంది చెప్పారు. విజ్ఞాపన పత్రాన్ని ఇస్తే పంపుతామని సిబ్బంది […]

  • Publish Date - May 19, 2021 / 10:15 AM IST

విధాత,అమరావతి : తాడేపల్లి‌లోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి సమీపంలో భరతమాత విగ్రహం వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన నరేష్, సరస్వతి దంపతులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్‌ను కలవాలని సెక్యురిటీ సిబ్బందిని దంపతులు కోరారు.

అయితే కొవిడ్ కారణంగా కలవడం కుదరదని చెక్ పోస్టు సిబ్బంది చెప్పారు. విజ్ఞాపన పత్రాన్ని ఇస్తే పంపుతామని సిబ్బంది చెప్పింది. అంతలో దంపతులు పెట్రోల్ పోసుకునే యత్నం చేయగా చెక్ పోస్టు సిబ్బంది అడ్డుకున్నారు. మహిళకు ఫిట్స్ ఉండడంతో తాడేపల్లి‌లోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.