Murder | దారుణం..తండ్రి గొంతుకోసి చంపిన కొడుకు

మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో బంధాలను మరిచి మృగాల్ల ప్రవర్తిస్తున్న కొందరు తమకు రక్తం పంచిన కన్నవాళ్లనే కడతేర్చుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి కన్నతండ్రినే గొంతు కోసి హత్య చేశాడు.

son-murders-parents-for-admitting-him-to-mental-hospital-in-hyderabad

విధాత :

మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో బంధాలను మరిచి మృగాల్ల ప్రవర్తిస్తున్న కొందరు తమకు రక్తం పంచిన కన్నవాళ్లనే కడతేర్చుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి కన్నతండ్రినే గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రేడు కు చెందిన ఒడిశాల అప్పారావు(49) ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పారావు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి కాగా, చిన్న కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూసే క్రమంలో తండ్రి కొడుకుల మధ్య సమస్య తలెత్తింది.

ఈ క్రమంలో గురువారం కట్నం విషయంలో గొడవ చెలరేగగా కొడుకు సాయికుమార్ ఆవేశంతో తండ్రిని గేడకేసి కొట్టాడు. అడ్డుకోబోయిన తల్లి, సోదరిని గదిలోకి నెట్టి తలుపులు వేశాడు. ఆ తరువాత ఇంట్లోని కూరగాయలు కోసే చాకుతో తండ్రి గొంతు కోశాడు. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.