Site icon vidhaatha

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం….

విధాత‌: నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వ‌చ్చింది.మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

పూరి జగన్నాధ్.. ఆగస్టు 31,ఛార్మి సెప్టెంబర్ 2,రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6,రాణా దగ్గుబాటి సెప్టెంబర్ 8,రవితేజ సెప్టెంబర్ 9,శ్రీనివాస్ సెప్టెంబర్ 9,నవదీప్ సెప్టెంబర్ 13,ఎఫ్ క్లబ్ జీఎం సెప్టెంబర్13,ముమైత్ఖాన్ సెప్టెంబర్ 15,తనీష్ సెప్టెంబర్ 17,నందు సెప్టెంబర్ 20,తరుణ్ సెప్టెంబర్ 22 న హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

Exit mobile version