Israeli Flag removed: తెలంగాణ సెక్రటేరియట్ ముందున్న ఇజ్రాయిల్ దేశం జాతీయ పతాకాన్ని ఓ యువకుడు తొలగించిన ఘటన కలకలం రేపింది. మే 12న సెక్రటేరియట్ బస్ స్టాప్ వెనకాల మిస్ వరల్డ్ పోటీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాలతో పాటు ఇజ్రాయిల్ జెండాను ఎగరవేసింది. నిందితుడు జకీర్ ఇజ్రాయిల్ జెండాను తీసివేసి ఇంస్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ కాగా వైరల్ గా మారింది.
ఈ ఘటనపై స్పందించిన సైఫాబాద్ పోలీసులు నిందిడుతు జకీర్ పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తిరిగి ప్రభుత్వ అధికారులు మళ్లీ ఇజ్రాయిల్ జెండాను యధాతథా స్థానంలో ఏర్పాటు చేశారు.