మిస్టర్ బచ్చన్ వంటి భారీ డిజాస్టర్ చిత్రం తర్వాత మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న కొత్త చిత్రం మాస్ జాతర (Mass Jathara). డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sree Leela) కథానాయికగా నటిస్తోంది.
తాజాగా శుక్రవారం ఈరోజు ఈ సినిమా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చి రవితేజ అభిమానులను ఆశ్చర్య పరిచారు. మాస్ జాతర సినిమాకు సంబంధించి ఓ ఇంట్లో భోజనానికి సిద్ధమై రాజసంగా మీసం తిప్పుతూ ఉన్న ఈ ఫస్ట్ లుక్ సినీ లవర్స్‌ను ఆకర్షించేలా ఉంది.
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని జనవరి 26 ఈ చిత్రం గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోండగా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు.