Pongal Movies | సంక్రాంతి 2026 బాక్సాఫీస్ విజేతలు యువ హీరోలే.. సీనియర్లకి గ‌ట్టి షాక్ ఇచ్చారుగా..!

Pongal Movies | 2026 ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు లాభాల పంట పండించింది. ఈ పండుగకు ఐదు సినిమాలు థియేటర్లలోకి రాగా, అందులో నాలుగు చిత్రాలు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగింట్లో రెండు సినిమాలు విడుదలైన మొదటి వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి లాభాల బాట పట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

Pongal Movies | 2026 ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు లాభాల పంట పండించింది. ఈ పండుగకు ఐదు సినిమాలు థియేటర్లలోకి రాగా, అందులో నాలుగు చిత్రాలు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగింట్లో రెండు సినిమాలు విడుదలైన మొదటి వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి లాభాల బాట పట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభాస్, చిరంజీవి, రవితేజ వంటి స్టార్ సీనియర్లు బరిలో ఉన్నప్పటికీ, ఈ సంక్రాంతి సీజన్‌లో శర్వానంద్, నవీన్ పోలిశెట్టి వంటి యువ హీరోలే తొలి విజయాలను తమ ఖాతాలో వేసుకోవడం విశేషంగా మారింది.

శర్వానంద్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ లేటుగా విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా, అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ షోలతో భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. సంక్రాంతి బరిలో ప్రభాస్, చిరంజీవి, రవితేజ వంటి పెద్ద హీరోల సినిమాలు ఉన్నా, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈసారి శర్వానంద్ మూవీనే ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్‌గా మారింది. దీంతో ‘నారీ నారీ నడుమ మురారి’తో శర్వానంద్ 2026 ఏడాదిలో తొలి బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడనే మాట వినిపిస్తోంది.

ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటింది. అంతేకాదు, యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరడం విశేషం. చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కంటే కూడా యూఎస్‌లో ‘అనగనగా ఒక రాజు’కి ఎక్కువ కలెక్షన్లు రావడం ట్రేడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి సినిమా ఎక్కువ సెంటర్లలో ఎక్కువ షోలతో నడుస్తున్నప్పటికీ, తక్కువ షోలతోనే నవీన్ పోలిశెట్టి మూవీ మిలియన్ డాలర్ మార్క్‌ను దాటడం గమనార్హం.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ కూడా సంక్రాంతి సెంటిమెంట్‌ను నిలబెట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే అదే సమయంలో ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీగా నిలవడంతో, చిరంజీవి సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తీవ్ర నెగిటివ్ టాక్ మధ్య విడుదలైన ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కూడా రేసులో వెనుకబడినప్పటికీ దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పండుగ సీజన్ కారణంగా ఈ చిత్రానికి స్టెడీ కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ భారీ అంచనాలతో వచ్చిన సీనియర్ స్టార్ సినిమాల మధ్య యువ హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద షాక్ ఇచ్చినట్లుగా పరిస్థితి మారింది. పోస్టర్లపై పెద్ద నెంబర్లు కనిపిస్తున్నా, వాస్తవ కలెక్షన్లలో మాత్రం యంగ్ హీరోల సినిమాలే పైచేయి సాధించాయన్నది ట్రేడ్ టాక్.

Latest News