Google | ప్లే స్టోర్‌ నుంచి 43 యాప్స్‌ను తొలగించిన గూగుల్‌.. వెంటనే డిలీట్‌ చేయాలని యూజర్లకు సూచన..!

Google | గూగుల్‌ తాజాగా 43 యాప్స్‌ను ప్లే స్టోర్‌ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. పాలసీలను ఉల్లంఘించిన ఆయా యాప్స్‌పై కొరడా ఝుళిపించింది. ఆయా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న యూజర్లు వెంటనే వాటిని డిలీట్‌ చేయాలని కోరింది. ఆయా యాప్స్‌ ఫోన్‌ బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గించడంతో పాటు యూజర్ల డేటాను భారీగా తస్కరిస్తున్నాయి. యూజర్ల స్మార్ట్ ఫోన్లు టర్న్ ఆఫ్ అయిన సందర్భంలో ఆయా యాప్‌లో యాడ్స్‌ను లోడ్‌ చేస్తున్నాయి. వాస్తవానికి ఇలా చేయడం గూగుల్‌ […]

  • Publish Date - August 28, 2023 / 01:21 AM IST

Google |

గూగుల్‌ తాజాగా 43 యాప్స్‌ను ప్లే స్టోర్‌ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. పాలసీలను ఉల్లంఘించిన ఆయా యాప్స్‌పై కొరడా ఝుళిపించింది. ఆయా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న యూజర్లు వెంటనే వాటిని డిలీట్‌ చేయాలని కోరింది.

ఆయా యాప్స్‌ ఫోన్‌ బ్యాటరీ జీవితకాలాన్ని తగ్గించడంతో పాటు యూజర్ల డేటాను భారీగా తస్కరిస్తున్నాయి. యూజర్ల స్మార్ట్ ఫోన్లు టర్న్ ఆఫ్ అయిన సందర్భంలో ఆయా యాప్‌లో యాడ్స్‌ను లోడ్‌ చేస్తున్నాయి. వాస్తవానికి ఇలా చేయడం గూగుల్‌ ప్లే స్టోర్‌ పాలసీకి విరుద్ధం. ఈ యాప్‌లను మొదటగా మెకాఫీలోని పరిశోధనా బృందం గుర్తించి.. గూగుల్‌కు నివేదించింది. దీంతో ఆయా యాప్స్‌ను ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది.

అయితే, కొన్ని యాప్‌లను డెవలపర్స్‌ అప్‌డేట్‌ చేయగా.. ప్లే స్టోర్ నుంచి ఆయా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లు డిలీట్‌ చేయాలని మెకాఫీ కోరింది. గూగుల్ ప్లే స్టోర్‌ పాలసీలను ఈ యాప్స్ ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది.

మొబైల్ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్న సమయంలో ఆయా యాప్‌లు ప్రకటలను ప్రదర్శిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా గూగుల్‌ ప్లే స్టోర్‌ డెలవలపర్స్‌ విధానాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని మెకాఫీ పేర్కొంది.

అదృశ్య ప్రకటనల కోసం చెల్లించే ప్రకటనదారులను మాత్రమే కాకుండా.. బ్యాటరీని హరించడం, డేటాను వినియోగించడం, క్లిక్కర్ ప్రవర్తనతో వినియోగదారు ప్రొఫైలింగ్‌కు అంతరాయం కలిగించడం వంటి ప్రమాదాలను కలిగిస్తుందని పేర్కొంది.

ఇక ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్‌ల జాబితాలో టీవీ/డీఎండీ ప్లేయర్స్, మ్యూజిక్ డౌన్‌లోడర్స్, న్యూస్ అండ్ క్యాలెండర్ యాప్స్, జిహోసాఫ్ట్ మొబైల్ రికవరీ యాప్, న్యూ లైవ్, లైవ్ మ్యూజిక్ తదితర యాప్స్‌ ఉన్నాయి.

Latest News