Site icon vidhaatha

Hyderabad | గోల్కొండ.. బోనాల ఉత్సవ షెడ్యూల్ విడుదల

విధాత: హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోల్కొండ బోనాలు 2025 నిర్వహణ షెడ్యూల్ ను విడుదల చేశారు. జూన్ 26 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని శ్రీ జగదాంబిక మహంకాళీ దేవాలయం పేర్కొంది. జులై 24తో గోల్కొండ బోనాల ఉత్సవం ముగుస్తుందని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలకు ప్రభుత్వం ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.

గోల్కొండలోని జగదాంబికా అమ్మవారు తొలి బోనంతో అషాఢ మాసంలో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు మళ్లీ గోల్కొండలోనే చివరి బోనంతో ముగుస్తాయి. మొదటి బోనం జగదాంబిక అమ్మవారి ఆలయంలో సమర్పించనుండగా..రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తుంటారు.

ఈ ఏడాది గోల్కొండ బోనాల షెడ్యూల్ లో భాగంగా మొదటి పూజ జూన్ 26న, రెండోపూజ(గోల్కొండ బోనాలు జాతర) 29న, మూడవ పూజ జూలై 3వ తేదీన, నాల్గవ పూజ(గోల్కొండ బోనాలు జాతర) జూలై 6వ తేదీన, ఐదవ పూజ జూలై 10న, ఆరవ పూజ(సికింద్రాబాద్ బోనాలు) జూలై 13న, ఏడవ పూజ జూలై 17న, ఎనిమిదవ పూజ(హైదరాబాద్ బోనాలు జాతర) జూలై 20న, తొమ్మిదొ పూజ జూలై 24తో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.

Exit mobile version