Site icon vidhaatha

కాల్పుల విరమణ కొనసాగుతుంది.. ముగింపు గడువు లేదు.. రక్షణశాఖ క్లారిటీ

భారత్, పాక్ ప్రస్తుతం కాల్పుల విరమణ పాటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారంతో కాల్పుల విరమణ గడువు పూర్తయ్యిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా రక్షణశాఖ క్లారిటీ ఇచ్చింది. కాల్పుల విరమణకు ముగింపు తేదీ ఏది లేదని అధికారులు స్పష్టం చేశారు. కాల్పుల విరమణ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.

ఇరు దేశాల సైనికాధికారుల మధ్య సాగిన చర్చల్లో ముగింపు తేదీ ఏది లేదని అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.

పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. అనంతరం పాకిస్థాన్ కూడా డ్రోన్లతో దాడికి యత్నించగా భారత్ వాటిని తిప్పికొట్టింది. అనంతరం పాకిస్థాన్ ఎయిర్ బేస్ ల మీద కూడా దాడి చేసింది.

దీంతో పాకిస్థాన్ శాంతి చర్చలకు సిద్ధమంటూ ప్రతిపాదనలు పంపడంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నది.

Exit mobile version