Site icon vidhaatha

మహాబలేశ్వర్ లో 15 సెంమీ వర్షపాతం నమోదు

విధాత:పశ్చిమ కనుమల్లో కృష్ణమ్మ జన్మస్థలం మహాబలేశ్వర్ లో బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.30 వరకు 15 సెంమీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం వరకు ఆల్మట్టి జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉంది.ఇవ్వాళ ఉదయానికి ఆల్మట్టికి 52,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా నీటి నిల్వ 100 టిఎంసీలకు చేరింది. మరో 30 టిఎంసీలు వస్తే పూర్తిగా నిండుతుంది. ఎగువ నుంచి భారీ వరద వచ్చే సూచనలున్నప్పుడు రిజర్వాయర్ ను 20-30 టిఎంసీలు ఖాళీ పెడతారు.తుంగభద్రకు 60 వేల క్యుసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.నీటి నిల్వ 60 టిఎంసీలు దాటింది. మరో 40 టిఎంసీలు చేరితే వచ్చిన నీరు వచ్చినట్టే శ్రీశైలానికి వదిలి పెడ్తారు. మరో వారం రోజుల్లో శ్రీశైలం ఇన్ ఫ్లో 2 లక్షలు దాటొచ్చు. ఆగస్టు మొదటి వారానికి రిజర్వాయర్ నిండుతుంది.

Exit mobile version