Site icon vidhaatha

Danam Nagender: అప్లయ్ అప్లయ్ నో రిప్లయ్.. పోయి శిలాఫలకం పగులగొట్టేశా! నా స్టైల్ ఇదే.. అసెంబ్లీలో మంత్రులపై దానం విమర్శలు

Danam Nagender |

విధాత: అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) మంత్రులపై ఘాటు విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో తన నియోజకవర్గం సమస్యలను ప్రస్తావించే క్రమంలో చాల మంది సమస్యలు చెబుతున్నారని.. అప్లయ్ అప్లయ్ నో రిప్లయ్ అన్నట్లుగా తయారైందన్నారు. తాము లేవనెత్తిన సమస్యలను మంత్రులు నోట్ చేసుకుంటామంటారు.. తర్వాత ఆ పేపర్లను చెత్త బుట్టలో వేస్తారన్నారు. గతంలో మంత్రిగా నేను కూడా అలాగే చేశానని చెప్పుకొచ్చారు.

నేను ఎవరిని బ్లెయిమ్ చేయడం లేదన్నారు. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని.. సభలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు. నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కు స్థలం కేటాయించమంటే రెవెన్యూ, జీహెచ్ఎంసీల నుంచి చర్యలు లేవని.. కాని స్థానిక ఎమ్మెల్యేగా నాకు తెలియకుండానే నా నియోజకవర్గంలోని ఈద్గా మైదానంలో అశ్చర్యకరంగా సబ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతించి శంకుస్థాపన చేశారని వెల్లడించారు. దీనిపై నేను ప్రివిలైజ్ నోటీస్ ఇవ్వవచ్చని.. చర్యలుండవన్న ఆలోచనతో నా రెగ్యూలర్ స్టైల్ లో నేను పోయి శిలాఫలకాన్ని పగులగొట్టేశానని.. నాకు వేరే అప్షన్ లేదన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంకు ఈ సమస్య తెలియచేస్తున్నానన్నారు.

నియోజకవకర్గంలోని పాఠశాలలకు ఆర్వో ఫ్లాంట్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదన్నారు. ఈడబ్ల్యుఎస్ కాలనీలో ఓ వ్యక్తి అక్రమంగా ఆరు ఫ్లోర్ ల భవనం నిర్మించారని.. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు లేవన్నారు. టౌన్ ప్లానింగ్ అఫీసర్, పై అధికారులు ఇలాంటి వాటిపై సెటిల్ మెంట్ లు చేసుకుంటున్నారన్నారు.సోషల్ మీడియా ప్రతినిధులు, అధికారులు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ చలామణి సాగిస్తూ అక్రమ నిర్మాణాలపై బ్లాక్ మెయిల్ కు, సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నారని ఇటువంటి వ్యవహారాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కు స్థలం ఇవ్వాలని కోరారు. దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమాధానిమిస్తూ ప్రభుత్వం ఏదైనా సభా నియమాల మేరకు సభ్యుడి లేవనెత్తిన సమస్యలను నోట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పడం విశేషం.

 

Exit mobile version