Site icon vidhaatha

Telangana: మంత్రి కోమటిరెడ్డిపై.. BRS సభాహక్కుల ఉల్లంఘన నోటీస్

విధాత : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు భవనాల శాఖకు చెందిన ప్రశ్నకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎస్ నిధులు రాలేదని, నల్లగొండ నియోజకవర్గ రోడ్లకు నిధులు కేటాయించలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఎస్క్రో అకౌంట్ తెరవలేదని కోమటిరెడ్డి ఇచ్చిన సమాధానం పూర్తిగా అవాస్తవమని స్పీకర్‌కు ఆధారాలు సమర్పించారు. సభను తప్పుదోవ పట్టించిన కోమటిరెడ్డిపై తమ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అనుమతించాలని వారు స్పీకర్ ను కోరారు.

Exit mobile version