Site icon vidhaatha

Warangal: ఓపెన్ విద్యార్థులకు మోడల్ పేపర్లు అందజేత‌

Warangal:
విధాత, వరంగల్: సార్వత్రిక విద్యావిధానంలో విద్యార్హతలు పొందిన వారు పలు ప్రభుత్వ ఉద్యోగాలలోను , ప్రయివేట్ ఉపాధి రంగంలోనూ రాణిస్తున్నారని, ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతున్నారని తెలంగాణ ఓపెన్ స్కూల్ రాష్ట్ర పరిశీలకురాలు టిప్పని అనురాధ అన్నారు. శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్ సెంటర్ లో జరిగిన ఎస్సెస్సీ ,ఇంటర్ క్లాసులను అనురాధ పరిశీలించారు. ఈసందర్భంగా విద్యార్థులందరికీ మోడల్ పేపర్లను పంపిణీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యా సంవత్సరంలో మూడు ఎస్సైన్ మెంట్లు రాయటం, కనీసం ఎనభై శాతం హాజరు తప్పనిసరి అని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ విద్యా విధానాన్ని ప్రోత్సాహిస్తుందని ఉచిత పాఠ్య పుస్తకాలు , స్టడీ మెటీరియల్ అందిస్తున్నదని ఆమె తెలిపారు. ఓపెన్ స్కూల్ సెంటర్లలో యేటా జరిగే ముప్పై ప్రత్యక్ష తరగతులలో కౌన్సిలర్స్ విద్యార్థులకు విద్యాభసనలో సహకారిగా వుంటారని ఆమె అన్నారు.

ఏ.ఐ. స్టడీ సెంటర్ అసిస్టెంట్ కో ఆర్డినేటర్ అజయ్ బాబు మాట్లాడుతూ సెంటర్ లో నమోదైన విద్యార్థులందరికీ క్లాసుల సమయంలో అన్ని రకాల మౌలిక సదు పాయాలు కల్పించామని. అన్ని సబ్జెక్ట్ లకు సంబంధించి విషయనిపుణులైన కౌన్సిలర్స్ వున్న ఫలితంగానే జిల్లాలో అధిక అడ్మిషన్లు నమోదయ్యాయని ,షెడ్యూల్ మేరకు ఇప్పటివరకు ఇరవై రెండు క్లాసులం నిర్వహించామని తెలిపారు. ఇంఛార్జీ కో ఆర్డినేటర్ వి. శ్రీనివాస్ రావు , కౌన్సిలర్లు దేవుపెల్లి కిరణ్ ,షౌకత్ అలీ , రవీందర్ తదిత రులు విద్యార్థులతో అనురాధ మాట్లాడి సెంటర్ పనితీరు తెలుసుకున్నారు. అన్ని రకాల రికార్డులను పరిశీలించి ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. పరీక్ష ఫీజు కట్టేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని విద్యార్థులు అనురాధనం కోరారు. డైరెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని ఆమె విద్యార్థులు కు హామీ ఇచ్చారు.

Exit mobile version