Site icon vidhaatha

TNGO | టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా అనురాధ ఎన్నిక‌

TNGO

విధాత, మెదక్ బ్యూరో: టీఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా మెదక్ పట్టణానికి చెందిన గాండ్ల అనురాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన రాష్ట్ర సంఘం ఎన్నికల్లో అనురాధకు అవకాశం దక్కింది.

ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షురాలుగా సేవలందిస్తున్న ఆమె రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చోటు కల్పించిన రాష్ట్ర సంఘానికి టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా ఎన్నికైన సందర్భంగా అనురాధను ఆయన అభినందించారు.

సమస్యల పరిష్కారానికి కృషి: అనురాధ

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేస్తూ సంఘ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తాన‌న్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ.. రాష్ట్ర, జిల్లా శాఖల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Exit mobile version