Site icon vidhaatha

ప్రధాని మోదీ, KTRలపై.. ఎంపీ చామల సెటైర్లు!

విధాత: కంచ గచ్చిబౌలి భూవివాదంతో ప్రతికూలంగా స్పందించడం పట్ల ప్రధాని మోదీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైరికల్ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి వారిద్ధరూ నష్టం చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా మీకు ధన్యవాదాలంటూ చామల వ్యంగ్యపూరిత విమర్శలు చేశారు. కంచగచ్చి బౌలి భూముల అభివృద్ధిని అడ్డుకున్నందుకు మీకు ధన్యవాదాలని.. ఎందుకంటే.. ఐటీ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నందుకు, తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగాలను అడ్డుకున్నందుకు అంటూ చామల సైటైర్లు వేశారు.

తాను క్రియేట్ చేయించిన ఏఐ ఫేక్ వీడియోలను నమ్మినందుకు..తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు నిధులు రాకుండా అడ్డుకున్నందుకు.. నిధులు పుష్కలంగా వస్తే ప్రజా సంక్షేమ ఇనుమడించి.. రేవంత్ సర్కారుకు మంచి పేరు వస్తుందని.. అది రాకుండా అడ్డుకున్నందుకు మీకు ధన్యవాదాలన్నారు. ఓవరాల్ గా తెలంగాణలో రేవంత్ సర్కారు కాళ్లల్లో కట్టె పెట్టడంలో తమతో కలిసి వచ్చినందుకు మీకు ధన్యవాదాలని ఎంపీ చామల ప్రధాని మోదీ, కేటీఆర్ లపై వ్యంగ్యోక్తులు విసిరారు.

Exit mobile version