Mirna Menon |
ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేని బ్యూటీ మిర్నా మీనన్ (Mirna Menon). చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ మలయాళ కుట్టి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తుంది.
గత సంవత్సరం రజనీకాంత్ జైలర్ సినిమాలో కోడలిగా విశేష గుర్తింపును తెచ్చుకుంది.
తెలుగులో క్రేజీ ఫెలో, ఉగ్రం, నా సామిరంగ వంటి చిత్రాలు చేసి ఇక్కడి వారికి దగ్గరైంది.
అయితే అందం, గ్లామర్, నటన అన్నీ ఉన్నా అవకాశాలు అశించినంతగా దక్కించుకోలేక పోతుంది.
అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం గ్లామర్ ఓలకబోస్తూ ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది.