Site icon vidhaatha

Rajinikanth | గవర్నర్‌గా జైలర్.. తమిళ నాట జోరుగా పుకార్లు

Rajinikanth |

ఈ మధ్య జైలర్ గా సూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు గవర్నర్ పోస్ట్ దక్కనుందా? ఈమేరకు ఢిల్లీ బిజెపి పెద్దలు ఆయనకు హామీ ఇచ్చారా ? ఏమో.. ఏదీ క్లారిటీ లేదు కానీ తమిళనాట పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే రెండు మూడు సార్లు రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిన రజనీ తన ఆలోచనలను, ఉద్దేశ్యాలను మాత్రం బయటికి చెప్పలేదు.

కానీ రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లే కనిపిస్తుంటారు. పోనీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారా అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఢిల్లీ పెద్దల తో మాత్రం సఖ్యతగా ఉంటున్నారు.

ఇక రజనీకి గవర్నర్ పోస్ట్ అనే ప్రచారంపై ఆయన సోదరుడు సత్యనారాయణ స్పందిస్తూ ‘రజనీకి గవర్నర్ పదవి దేవుడి చేతుల్లో ఉంది. అలాగ‌ని ప్రజా క్షేత్రంలోకి వ‌స్తార‌ని ఆశించాల్సిన ప‌నిలేదు. తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో రజనీకాంత్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు.

ఇలాంటి స‌మావేశాల్లో పాల్గొన‌డం స‌హ‌జంగా జ‌రుగుతుంది. కేవ‌లం రాజ‌కీయాల కోస‌మే భేటి అంటే పొర‌బ‌డిన‌ట్లే’ అని తేల్చేశారు. ఇదిలా ఉండగా ఈమధ్య యుపి వెళ్లిన రజనీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌, అఖిలేష్ యాదవ్ తదితరులతో భేటీ అయ్యారు.

భేటీ కావడంతో గవర్నర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ర‌జ‌నీ ఇలా ముఖ్య‌మంత్రుల‌ని క‌ల‌వ‌డం వెనుక రాజ‌కీయ కోణం ఉంద‌ని అంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలా ముఖ్యమంత్రులను కలవని జైలర్ రజనీ ఇప్పుడెందుకు వెళ్తున్నారు.. ఆయనకు రాజకీయ ఉద్దేశ్యాలు ఏమైనా ఉన్నాయా అని అంటున్నారు.

Exit mobile version