Site icon vidhaatha

Rashi Phalalu | ఉగాది స్పెష‌ల్‌.. ఈ రోజు (మార్చి 30, ఆదివారం) మీ రాశి ఫలాలు! వారికి.. అంచనాలకు మించి ధ‌న పురోగతి

Horoscope | జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం. లేచిన నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆరోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం మార్చి 30, ఆదివారం ఉగాది పర్వదినం రోజున వారి వారి పేర్ల మీద‌ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

మేషం (Aries) : వీరి ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోల‌న. ఆకస్మిక ధననష్టం. అస్థిర నిర్ణయాలు. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. తలపెట్టిన కార్యాలు సజావుగా సాగును. అనవసర భయం ఆవహిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం. వ్యాపారాల్లో లాభాలు. రోజంతా సానుకూలంగా గడుస్తుంది.
.
వృషభం (Taurus) : వ్యక్తిగత సమస్యలన్నీ తొలిగిపోతాయి. ఆకస్మిక ధననష్టం జ‌రిగే అవకాశం. కొన్ని ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.స్వల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి.అన‌వ‌స‌ర ప్రయాణాలు చేస్తారు. స్థాన చలనం జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. సన్నిహితులతో స్నేహంగా మెల‌గాలి. సంతృప్తికరంగా వ్యాపారాలు. ఆర్థిక లావాదేవీలు, ఆదాయ ప్రయత్నాలు లాభం చేకూరుస్తాయి.

మిథునం (Gemini) : వీరికి ఎటువంటి ప్రయత్నమైనా సఫలం. వ్యవసాయదారుల‌కు లాభదాయకం. తొందరపాటుతో ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. ధన పరంగా అంచనాలకు మించిన పురోగతి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం.వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తొలుగుతాయి.

కర్కాటకం (Cancer) : ఈ రాశి వారికీ సజావుగా వృత్తి, వ్యాపారాలు. ప్రోత్సాహకాలు, ప్రతిఫలాలు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల వల్ల ఆర్థిక నష్టం. ఆకస్మిక కలహాలకు అవకాశం. ధన నష్టం. అధిక‌ రుణప్రయత్నాలు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు ఆల‌స్యంగా పూర్తి. ఉద్యోగంలో పనిభారం.

సింహం (Leo) : వీరికి మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. విద్యార్థులకు అనుకూల‌ సమయం. ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం, తీరిక లేని పరిస్థితి.

కన్య (Virgo) : వీరికి బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం. తలపెట్టిన ప‌నుల‌న్నీ సఫలం. కీర్తి, ప్రతిష్ఠలు అధికం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలతో లాభాలు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు.నిలకడగా వృత్తి, వ్యాపారాలు.

తుల (Libra) : వీరికి ఈ రోజు కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధననష్టం. స్థిరాస్తుల విషయంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. విద్యార్థులకు మంచి విజ‌యాలు. క్రీడాకారులు, రాజకీయాల్లోని వారికి మానసిక ఆందోళన. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాలి. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు. ఉద్యోగంలో ప్రాధాన్యత‌. ఆరోగ్యం సాఫీగా ఉంటుంది.

వృశ్చికం (Scorpio) : వీరికి కుటుంబ సభ్యులతో దైవ కార్యాలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు పోతాయి. రుణప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ముఖ్యమైన ప‌నులు నిదానంగా చేస్తారు. కుటుంబంలో మనశ్శాంతి పోతుంది. బంధు, మిత్రులతో వైరం అవ‌కాశం. రహస్య శతృబాధలు. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు.

ధనుస్సు (Sagittarius) : వీరికి ఈ రోజు మెరుగ్గా ఆర్థిక పరిస్థితి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో విందులు, వినోదాలు. మంచి పరిచయాలు ఏర్ప‌డుతాయి. ఆకస్మిక ధన లాభం. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి. స‌జావుగా ఆదాయం, ఆరోగ్యం. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు.

మకరం (Capricorn) : వీరికి ఈ రోజు వదిలేసుకున్న డబ్బు చేతికి వ‌స్తుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభర‌ణాలు వంటి లాభాలు క‌లుగుతాయి. వ్యక్తిగత సమస్య పరి ష్కారం. ఆకస్మిక ధనలాభం. సానుకూలంగా ఆర్థిక విషయాలు. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గుతాయి. బంధు, మిత్రులతో విందులు, వినోదాలు. ఒక ముఖ్య కార్యక్రమం పూర్తి. వ్యాపారంలో క్షణం కూడా తీరిక ఉండ‌దు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి.

కుంభం (Aquarius) : ఈ రోజుఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారికి పేరు చెడిపోయే అవ‌కాశాలు అధికం. మనోల్లాసం ఉంటుంది. ఇతరుల విషయాల్లో వేలు పెట్టొద్దు. సోదరులతో ప్రేమ‌గా ఉండాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలుగుతాయి. కొత్త‌వ్యక్తుల జోలికి వెళ్లోద్దు. సొంత నిర్ణయాల‌తో వృత్తి, వ్యాపారాల్లో లబ్ధి. పై స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి.

మీనం (Pisces) : ఈ రోజు అనుకోకుండా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం. కొద్దిగా అనారోగ్య స‌మ‌స్య‌లు. పిల్లల విష‌యంలో పట్టుదలతో ఉండ‌కూడ‌దు. మనోద్వేగానికి గురవుతారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోపం నియంత్రించుకోవాలి . కొత్త పనులు ప్రారంభిచక పోవ‌డం మంచిది. సానుకూలంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు. లాభసాటిగా వ్యాపారాలు. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం.

Exit mobile version