విధాత: ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరుకు నిరసనగా హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేపట్టారు . పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. హైకమిషన్ కార్యాలయం వద్ధకు చొచ్చుకుని పోయే క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే ఇప్పటికే భారత్ నుంచి వెళ్లాలని పాక్ హైకమిషన్‌ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను కూడా పోలీసులు తొలగించారు. పాక్ పర్యాటకులు, పౌరులు 48 గంటల్లో భారత్ వీడాలని ఆదేశించింది.భారత్ లో పాక్ ప్రభుత్వ X (ట్విట్టర్) ఖాతా నిలిపివేసింది.
అంతకుముందు పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి కేక్ డెలివరీ వ్యవహారం దూమారం రేపింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను పాక్ ఎంబసీ అధికారులు సెలబ్రేషన్స్ చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. కేక్ ఎవరు..ఎందుకు ఆర్డర్ ఇచ్చారని అక్కడ మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో డెలివరి బాయ్ అక్కడి నుంచి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ వ్యవహారం పాక్ హైకమిషన్ కార్యాలయం వద్ధ నిరసలకు ఆజ్యం పోసినట్లయ్యింది.