Site icon vidhaatha

Ramcharan: క్లింకారా.. క‌నిపించేది అప్పుడే! రివీల్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌

విధాత‌: రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోల వ‌స్తున్న గేమ్ చేంజ‌ర్. రిలీజ్‌కు మ‌రో తొమ్మ‌ది రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో ప్ర‌చాక కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచారు. ఇప్ప‌టికే అమెరికా ఈవెంట్ స‌క్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న చిత్ర యూనిట్ మూడు రోజుల క్రితం ఈ సినిమా నుంచి రామ్‌చ‌ర‌ణ్ లుక్‌తో దేశంలోనే అతి పెద్ద క‌టౌట్‌ను అవిష్క‌రించి సినిమాపై హైప్ పెంచారు.

ఈక్ర‌మంలో తాజాగా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలోను చ‌ర‌ణ్ పాల్గొని సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ మంగ‌ళ‌వారం జరిగ‌గా చరణ్‌ను బాలయ్య ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి లోప‌లికి క‌లిసి వెళుతున్న‌ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ కార్య‌క్ర‌మంలో మ‌రో హీరో, రామ్‌చ‌ర‌ణ్ బాల్య మిత్రుడు శ‌ర్వానంద్ కూడా పాల్గొన‌డంతో ఈ ప్రొగ్రాంపై ఆస‌క్తి మ‌రింత పెరిగేలా చేసింది.

ఇందుకు సంబంధించిన ట్రైల‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు. సుమారు 4 నిమిషాల‌కు పైగా నిడివి ఉన్న ఈ ట్రైల‌ర్‌ను చూస్తే ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది. బాల‌య్య‌, రామ్ చ‌ర‌ణ్ త‌మ‌దైన స్టైల్ మాటామంతితో అల‌రించారు. అంతేకాదు ప్ర‌భాస్‌తో స‌ర‌దా సంభాష‌ణ్ చేశారు.

అంతేకాదు నాన్న అని పిలిచిన మరుక్షణమే కూతురు క్లింకారా ఫేస్‌ను రివీల్ చేస్తానంటూ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్  తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ ప్రొగ్రాంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కాగా ఈ ప్రోగ్రాం జ‌న‌వ‌రి ఈ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలాఉండ‌గా బాల‌కృష్ణ‌ డాకు మ‌హారాజ్ కూడా రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజ‌ర్‌కు పోటీగా థియేట‌ర్ల‌కు వ‌స్తుండ‌డం విశేషం.

Exit mobile version