Site icon vidhaatha

అల్లు రామాయణంలో రాముడిగా రణబీర్‌.. సీతగా సాయి పల్లవి

అల్లు రామాయణంలో రాముడిగా రణబీర్‌.. సీతగా సాయి పల్లవి

Ranbir as Rama, Sai Pallavi as Sita for Ramayana


విధాత: అల్లు అరవింద్ నిర్మాతగా బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తీయబోతున్న రామాయణం చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్‌, సీతగా సాయి పల్లవిలను ఎంపికైనట్లుగా తెలిసింది. గతంలోనే రాముడి పాత్రకు రణబీర్‌ను ఫైనల్ చేయగా, సీత పాత్రకు ఆలియాభట్‌ను తీసుకుంటారన్న టాక్ నడిచింది. ఆమెకు లుక్ టెస్టు్ కూడా చేశారు. ఇప్పుడు అనుహ్యంగా సీత పాత్రకు సాయి పల్లవి పేరు ఫైనల్ అయినట్లుగా సమాచారం.


సాయిపల్లవి అయితేనే సీత పాత్రకు సరిపోతుందని భావించిన మేకర్స్ ఆమెను సంప్రదించారట. సీత పాత్రకు సాయి పల్లవి కూడా ఒకే చెప్పడంతో త్వరలోనే లుక్ టెస్టు చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారని ఫిల్మీ వర్గాల సమాచారం. రెండు షెడ్యూల్‌లలో రామాయణ సినిమాను పూర్తి చేస్తారట. ఇందులో ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మొదటి షెడ్యూల్‌లోనే రణబీర్‌, సాయిపల్లవిలపై తీయాల్సిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో కూడా వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్ వినియోగించనున్నారు.

Exit mobile version