Rajamouli | తెలుగు సినీ, టీవీ పరిశ్రమలో ఎన్నేళ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్దస్త్ రాజమౌళి. ముఖ్యంగా జబర్దస్త్ షోలో మందు తాగిన వ్యక్తి క్యారెక్టర్లతో, మందుపై పేరడీ పాటలు పాడుతూ చేసిన స్కిట్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి రాజమౌళి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అత్యంత కఠినమైన అనుభవం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. కరోనా వచ్చిన సమయంలో తన పరిస్థితి చాలా విషమంగా మారిందని వెల్లడించారు. “నాకు కరోనా వచ్చినప్పుడు నిజంగా చనిపోతానని అనుకున్నాను. అంత సీరియస్‌గా అనిపించింది. పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే… మళ్లీ బతుకుతానా లేదా అన్న సందేహం కూడా వచ్చింది” అని ఆయన చెప్పారు.
ఆ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారిని గుర్తు చేసుకుంటూ రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు.
“అభి అన్నతో పాటు జబర్దస్త్ షోలో ఉన్న కొంతమంది నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భోలే, ఆయన ఫ్యామిలీ మా ఫ్యామిలీకి చాలా అండగా నిలిచారు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో తనకు షుగర్ స్థాయిలు కూడా తీవ్రంగా పెరిగాయని రాజమౌళి తెలిపారు. ఏది పడితే అది తినకూడదు అనే పరిస్థితి. అందుకే నా కోసం సపరేట్‌గా భోలే వాళ్ల అమ్మ, ఆయన భార్య ప్రత్యేకంగా వండుకుని హాస్పిటల్‌కు తీసుకొచ్చేవారు. వాళ్ల సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని చెప్పారు. తన వల్లే కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని చెప్పిన రాజమౌళి.. ఆ విషయం గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
నా వల్ల మా అమ్మకు, భార్యకు, పిల్లలకు, అన్న వాళ్లకు కూడా కరోనా వచ్చింది. నా భార్య ఎక్కడ చనిపోతుందో, నా పిల్లలు ఎక్కడ ఏం అవుతారో అన్న భయం నన్ను వెంటాడింది. మేము ఎవరు బతుకుతామో, ఎవరు చనిపోతామో మాకే తెలియని పరిస్థితి” అంటూ తన బాధను వ్యక్తం చేశారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ రాజమౌళి మరింత ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో ఎంత భయపడ్డానో చెప్పలేను. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. కరోనా మన జీవితాలను ఎంతగా మార్చిందో నేను ప్రత్యక్షంగా అనుభవించాను అని అన్నారు. సరదా పాత్రలతో ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ రాజమౌళి.. తన జీవితంలో ఎదురైన ఈ విషాద అనుభవాన్ని ఇలా మనస్పూర్తిగా పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన మాటలు విన్న అభిమానులు, నెటిజన్లు ‘మీరు బలంగా నిలబడ్డారు’, ‘మీ అనుభవం చాలా మందికి కళ్ళు తెరిపిస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
