Jabardasth | జ‌బ‌ర్ధ‌స్త్ నుండి చ‌మ్మ‌క్ చంద్ర బ‌య‌ట‌కు పోవ‌డానికి కార‌ణం ఇదే.. ఇన్నాళ్ల‌కి బ‌య‌ట‌పెట్టిన వెంకీ

Jabardasth | జబర్దస్త్ వేదికపై ‘వెంకీ మంకీ’ టీమ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన కష్టాలు, మానసిక సంఘర్షణలు, విజయాల వెనుక ఉన్న నిజాలను వెల్లడించాడు

Jabardasth | జబర్దస్త్ వేదికపై ‘వెంకీ మంకీ’ టీమ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన కష్టాలు, మానసిక సంఘర్షణలు, విజయాల వెనుక ఉన్న నిజాలను వెల్లడించాడు. తన ప్రయాణం అంత సులభం కాదని, ఒక దశలో పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.

కెరీర్ ప్రారంభ రోజుల్లో స్నేహితుల ముందు పరువు పోయిందనే భావన తనను తీవ్రంగా కలచివేసిందని వెంకీ తెలిపాడు. ఆ సమయంలో జబర్దస్త్ నుంచి “ఇదే నీ చివరి షెడ్యూల్” అని నితిన్, భరత్ అన్నల నుంచి వచ్చిన కాల్ తనను పూర్తిగా నిరాశలోకి నెట్టిందని చెప్పాడు. అవకాశాలు అన్నీ ముగిసిపోయాయనే భావనతో తీవ్రంగా కుంగిపోయానని వివరించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అదే టీమ్ నుంచి మళ్లీ పిలుపు రావడం తన జీవితాన్ని మలుపు తిప్పిందన్నాడు. ఆ క్షణం నుంచే మైసమ్మ ఆశీస్సులతో సొంతంగా స్క్రిప్ట్‌లు రాయాలని నిర్ణయించుకున్నానని వెంకీ వెల్లడించాడు.

రెండు లైన్ల కామెడీతో తిరుగులేని గుర్తింపు

సినిమాల నుంచి ప్రేరణ పొంది, రెండు లైన్లలోనే ప్రేక్షకులను నవ్వించే కాన్సెప్ట్‌తో స్కిట్లు రూపొందించడం మొదలుపెట్టానని వెంకీ తెలిపారు. తన ఆలోచనను నితిన్, భరత్ అన్నలకు పర్ఫార్మెన్స్ ద్వారా చూపించగా వారు తనను ప్రోత్సహించారని చెప్పారు. మొదట నాగబాబు తన స్కిట్‌పై సందేహం వ్యక్తం చేసినప్పటికీ, చివరికి ఆయన పడిపడి నవ్వడం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని వెంకీ గుర్తుచేసుకున్నాడు.

కన్ఫ్యూషన్ డ్రామానే తన బ్రాండ్

‘గిఫ్ట్’ ఎపిసోడ్ తన జీవితాన్నే మార్చేసిందని వెంకీ తెలిపారు. ఇంట్లో జరిగిన ఓ చిన్న సంఘటన ఆధారంగా టీపై రూపొందించిన స్కిట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందన్నారు. అప్పటి నుంచే కన్ఫ్యూషన్ డ్రామా తన ట్రేడ్‌మార్క్‌గా మారిందని, ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా స్క్రిప్ట్‌లు రాయడమే తన విజయ రహస్యం అని స్పష్టం చేశాడు.

టీమ్ లేకుండా నేను లేను

జీవన్, పంచు ప్రసాద్, ఇమ్మానుయేల్, తాగుబోతు రమేష్ వంటి సహనటులను సమానంగా చూసుకుంటూ, వారికి ప్రాధాన్యం ఇచ్చేలా క్యారెక్టర్లు రాస్తున్నానని వెంకీ తెలిపారు. కొందరు తమ పాత్రలకే పరిమితమవ్వాలనుకుంటే, తాను మాత్రం టీమ్ అంతా నిలబడాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నానని చెప్పాడు.

చమ్మక్ చంద్రపై కామెంట్స్

ఇంటర్వ్యూలో చమ్మక్ చంద్ర గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వెంకీ. చంద్ర త్వరలో మూడు సినిమాల్లో హీరోగా నటించబోతున్నాడని పేర్కొన్నాడు. చాలా మంది కమెడియన్లు సినిమాల్లో చిన్న పాత్రలకే పరిమితమవుతున్నా, తన టీమ్‌ను, తన కళను నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని వెంకీ స్పష్టం చేశాడు. జబర్దస్త్ వేదికపై నవ్వులు పంచే వెంకీ వెనుక ఇంతటి పోరాటం దాగి ఉందని ఈ ఇంటర్వ్యూ మరోసారి తెలియజేసింది.

Latest News