విధాత : వెండి, బంగారం ధరలు పోటీ పడుతున్నట్లుగా పెరిగిపోతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.5,020పెరిగి రూ.1,54,800 ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.4,600పెరిగి రూ.1,41,900చేరింది.
నిలకడగా వెండి ధరలు
రోజురోజుకు సరికొత్త ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేస్తూ పైకి వెలుతున్న వెండి ధర బుధవారం నిలకడగా ఉండి అశ్చర్యపరిచాయి.కిలో వెండి ధర క్రితం రోజు ధర రూ.3,40,000వద్ద ఆగింది. అంతర్జాతీయంగా అస్థిర పరిణామాలు, డాలర్ విలువ, ఫెడరల్ వడ్డీ రేట్లు, గ్రీన్ ల్యాండ్ స్వాధీనం దిశగా అమెరికా చర్యలు వంటి పరిణామాలు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యూరోపియన్ దేశాలపై సుంకాల విధింపుల హెచ్చరికలతో పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. బంగారం, వెండి వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరల ర్యాలీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం బంగారం ధర అనూహ్యంగా పైకి దూసుకుపోయింది.
