విధాత : కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1నుంచి పాన్ కార్డు దరఖాస్తు రూల్స్ మారిపోనున్నాయి. ప్రస్తుతం ఎవరైనా కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు కాపీని జత చేస్తే సరిపోతుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డుతో పాటు అదనపు డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. కేవలం ఆధార్‌తోనే పాన్ పొందాలనుకుంటే మాత్రం మార్చి 31వ తేదీయే తుది గడువు అని కేంద్రానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్ తెలిపింది.
బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డు కీలకంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు నూతన పాన్ కార్డు కోసం ఆధార్ కార్డు కాపీ జత చేస్తే సరిపోయేది. కొత్త నిబంధనల మేరకు ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ కార్డు, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ , అఫిడవిట్ వంటి పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. వంటి వాటిల్లో ఏదో ఒకటి జత చేయాల్సి ఉంటుందని కామన్ సర్వీస్ సెంటర్ వెల్లడించింది.
ఏప్రిల్ ఒకటి తర్వాత పాత పాన్ దరఖాస్తు ఫారాలను కూడా అనుమతించేది ఉండదని కామన్ సర్వీస్ సెంటర్ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తు ఫారాలు కూడా మారతాయని, కొత్తవి అందుబాటులోకి వస్తాయని కామన్ సర్వీస్ సెంటర్ తెలిపింది. అలాగే ఆన్‌లైన్‌లో కొత్త పాన్ కార్డు దరఖాస్తు కోసం utiitsl pan, Protean వెబ్‌సైట్లను సందర్శించాలని పేర్కొంది. తక్షణమే ఇ-పాన్ పొందాలంటే ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్ట్‌లో కూడా పొందవచ్చని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన జాగృతి చీఫ్ కవిత
Tandur MLA Manohar Reddy : తాండూరు యువతను నాశనం చేశాడు
