ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన జాగృతి చీఫ్ కవిత

ఢిల్లీ లిక్కర్ కేసు నేపథ్యంలో తెలంగాణ జాగృతి చీఫ్ కవిత రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరై సంతకాలు చేశారు. కేసుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన జాగృతి చీఫ్ కవిత

న్యూఢిల్లీ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత, కేజ్రవాల్ సహా 23 మంది నిందితులందరిని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసు తీర్పు నేపథ్యంలో నిబంధనల ప్రకారం కవిత కోర్టుకు హాజరై సంతకాలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ లపై అక్కడి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో తాజాగా సోమవారం వాదనలు విన్న హైకోర్టు వచ్చే విచారణను హైకోర్టు ఏప్రిల్‌ 6కు వాయిదా వేసింది. విచారణ జరిగిన సందర్భంగా సీబీఐ తరపున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. నిందితులంతా సీబీఐపై ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి ఆరోపణలను ప్రోత్సహించవద్దని కోరారు. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరారు. దీంతో ప్రతివాదులంతా ఏప్రిల్‌ 5లోగా రిప్లయ్‌ ఫైల్‌ చెయ్యాలని జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ ఆదేశించారు. ఇక ఈ కేసును ఢిల్లీ హైకోర్టులో మరో బెంచ్‌కు మార్చాలని కోరుతూ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు వచ్చే వరకు చట్ట ప్రకారం హైకోర్టు విచారణ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి :

దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: కేంద్రం స్పష్టీకరణ
షాంపూలు మానేస్తే ఏమవుతుంది? జుట్టులో వచ్చే మార్పులు ఇవే!