అరుదైన కోతితో విక్రమ్ వీడియో.. వివాదం !

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ సరదా వీడియో వివాదాస్పదమైంది. అంతరించిపోతున్న 'లార్ గిబ్బన్' అనే అరుదైన కోతితో ఆయన వీడియోలో కనిపించారు. ఆ వన్యప్రాణిని చెన్నైకి ఎలా తీసుకువచ్చారు? దానికి సంబంధించి తగిన అనుమతులు ఉన్నాయా? అనే కోణంలో తమిళనాడు అటవీ అధికారులు విచారణ చేపట్టడం వివాదస్పదంగా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | వినోదం | Aug 11, 2026, 12:18 pm IST
Read Time: 3 mins
అరుదైన కోతితో విక్రమ్ వీడియో.. వివాదం !

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ సరదా వీడియో వివాదాస్పదమైంది. అంతరించిపోతున్న ‘లార్ గిబ్బన్’ అనే అరుదైన కోతితో ఆయన వీడియోలో కనిపించారు. చెన్నైలోని తన బంధువు ఇంట్లో విక్రమ్ ఈ వీడియో తీసినట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు.. ఆ వన్యప్రాణిని చెన్నైకి ఎలా తీసుకువచ్చారు? దానికి సంబంధించి తగిన అనుమతులు ఉన్నాయా? అనే కోణంలో ఇప్పుడు తమిళనాడు అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఈ వీడియోపై తమిళనాడు అటవీ శాఖ విచారణ చేపట్టడంతో విక్రమ్ ఆ వీడియోను డిలీట్ చేశారు. ఈ కోతి విక్రమ్ వియ్యంకుడు, ప్రముఖ వ్యాపారవేత్త సి.కె. రంగనాథన్‌కు చెందినదిగా గుర్తించి అధికారులు విచారణ జరుపుతున్నారు. వీడియోలో ఉన్న ‘లార్ గిబ్బన్’ అనే అరుదైన కోతి అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉంది. ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం, సీఐటీఈఎస్ నిబంధనల ప్రకారం రక్షిత జాతికి చెందింది.

ఈ అరుదైన జంతువును ఇంట్లో పెంచుకోవడానికి లేదా ఉంచుకోవడానికి ఎలాంటి సరైన క్లియరెన్స్ పత్రాలు లేవని చెన్నై వైల్డ్‌లైఫ్ వార్డెన్ గుర్తించారు. అనుమతులు లేకుండా అడవి జంతువులను కలిగి ఉండటం, అక్రమ రవాణా కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.