Veera Dheera Soora Trailer | విక్రమ్ వీర ధీర శూర ట్రైలర్ వచ్చేసింది

Veera Dheera Soora Trailer |
తమిళ అఅగ్ర నటుడు విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న కొత్త చిత్రం వీర ధీర శూర (Veera Dheera Soora) పార్ట్2. మార్చి27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత సంవత్సరం సిద్ధార్థ్‌తో చిత్తా (చిన్నా) అనే డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన SU అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 1 షూటింగ్ చేయకుండానే పార్ట్2 చిత్రీకరణను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడం విశేషం. ఈ మూవీ విడుదల అనంతరం ఫ్రీక్వెల్‌గా మొదటి భాగాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విక్రమ్ కిరాణ షాపు నడిపేవాడిగా మరోవైపు నేర ప్రపంచంతో సంబంధాలు, పోలీసులతో పోరాడే వ్యక్తిగా నటిస్తోండగా దుషారా విజయన్ కథానాయిక. ఎస్జే సూర్య, మలయాళ పాపులర్ యాక్టర్ సూరజ్ వెంజరమూడు, థర్టీ ఇయర్స్ ఫృథ్వీ, సిద్ధిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.