Aadhaar Card | పెరిగిన ఆధార్ కార్డు అప్డేట్ ఛార్జీలు.. నేటి నుంచి అమ‌ల్లోకి

Aadhaar Card | ఆధార్ కార్డు( Aadhaar card ) ఫీజుల పెంపు విష‌యంలో యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ పెంచిన ఫీజులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Aadhaar Card | పెరిగిన ఆధార్ కార్డు అప్డేట్ ఛార్జీలు.. నేటి నుంచి అమ‌ల్లోకి

Aadhaar Card | పుట్టిన శిశువు నుంచి పండు ముస‌లి వ‌ర‌కు ఆధార్ కార్డు( Aadhaar Card )త‌ప్ప‌నిసరి అయింది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు ఆధార్ కార్డు(Aadhaar)ను అప్డేట్ చేసుకుంటూనే ఉంటున్నారు వినియోగ‌దారులు. మ‌రి ముఖ్యంగా పిల్ల‌ల వ‌య‌సు ఐదేండ్లు దాటిన త‌ర్వాత వారి బ‌యోమెట్రిక్ అప్డేట్( Biometric Update ) చేయ‌డం త‌ప్పనిస‌రి. దాంతో ఇల్లు మారిన ప్ర‌తిసారి చిరునామా కోసం ఆధార్ అప్డేట్ చేయించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే ఈ రెండింటి సేవ‌ల విష‌యంలో ఆధార్ కార్డు ఫీజుల పెంపు విష‌యంలో యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ పెంచిన ఫీజులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ నిర్ణ‌యం నేటి నుంచి అమ‌ల్లోకి రావ‌డంతో.. ఐదేండ్ల నుంచి 17 ఏండ్ల వ‌య‌సు గ‌ల వారిలో వేలిముద్ర‌ల‌ను(Biometric Update – Fingerprint/ Iris) ఆధార్‌లో అప్డేట్ చేయించుకోవాలంటే రూ. 100 వ‌సూలు చేసేవారు. ఇక‌పై ఈ ఫీజు రూ. 125కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. అదే విధంగా చిరునామా మార్చుకోవడానికి రూ. 50 వసూలు చేస్తుండగా.. కొత్త మార్పులు అమలైన తర్వాత ఇది రూ. 75కి పెరగనుంది. ఈ ఛార్జీల పెంపు అక్టోబర్ 1, 2025 నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. ఈ ఛార్జీల పెంపు విష‌యంలో.. ఇప్ప‌టికే అన్ని ప్రాంతీయ కార్యాల‌యాల‌కు తెలిపారు.

ఫీజు వ‌సూలు చేసేది వీటికే..

1. వేలి ముద్ర (Biometric) అప్‌డేట్: వయసు ఆధారంగా బైయోమెట్రిక్ డేటాను సరికొత్తగా నమోదు చేయడం లేదా సరిచేయడం.
2. చిరునామా మార్పు (Address Update): వ్యక్తిగత చిరునామా, పిన్ కోడ్, జిల్లా లేదా రాష్ట్రం మార్చే ప్రక్రియ.

UIDAI అధికారుల ప్రకటన ప్రకారం.. చార్జీల పెంపు ప్రధానంగా సేవల నిర్వహణ ఖర్చులు, సాంకేతిక ఆధునికీకరణ, సిస్టమ్ నిర్వహణ ఖర్చులు, డేటా భద్రత కోసం తీసుకున్న నిర్ణయంగా తెలిపింది. ఆధార్ వ్యవస్థలో విస్తృత సంఖ్యలో వినియోగదారులు ఉండటంతో.. ఈ మార్పు సేవల నాణ్యతను నిలుపుకోవడానికి అవసరం.