US Vlogger Gabruji Emotional Video : ఇండియాను మిస్ అవుతా.. అమెరికా పర్యాటకుడి భావోద్వేగం
భారత పర్యటన ముగించుకుని వెళ్తున్న అమెరికా వ్లాగర్ 'గబ్రూజీ' ఎమోషనల్ అయ్యారు. "మోదీ జీ.. నాకు ఆధార్ కార్డు కావాలి" అంటూ భారతీయుల ఆతిథ్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
విధాత : నేను ఇండియాను మిస్ అవుతున్నానంటూ అమెరికా పర్యాటకుడు(వ్లాగర్) ‘గబ్రూజీ’ భావోద్వేగం వెలిబుచ్చారు. భారత పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న అమెరికా వ్లాగర్ ‘గబ్రూజీ’ ఎమోషనల్ అయ్యారు. బైక్‌పై ప్రయాణిస్తూ రికార్డ్ చేసిన వీడియోలో.. ‘ నరేంద్రమోదీ జీ.. నాకూ ఆధార్ కార్డు తీసుకోవాలని ఉంది. భారత్ పర్యటనలో ప్రతి విషయం నా మనసుకు హత్తుకుంది. థ్యాంక్యూ ఇండియా.. నిన్ను మిస్ అవుతా’ అంటూ తన ప్రేమను చాటుకున్నారు.
భారతదేశంలోని రోజువారీ జీవితంపై తన అనుభవాలను వివరిస్తూ..దేశాన్ని ప్రశంసించారు. భారత ప్రజల ఆప్యాయత, ఆతిథ్యాన్ని అతను ప్రశంసించాడు. భారతీయులు..విదేశీయుల వద్దనే అన్ని ఉన్నాయనుకుంటారని..నిజానికి భారతీయుల దగ్గరే అన్నీ ఉన్నాయని నేను అనుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈ దేశంలోనే అన్నీ ఉన్నాయి అని.. మీ ఇల్లు శుభ్రం చేయడానికి మనుషులు కావాలా? ఇక్కడ ఉంటారని.. మిమ్మల్ని మోటార్‌సైకిల్‌పై ఫుట్‌పాత్ మీదుగా తీసుకెళ్లడానికి మనుషులు కావాలా? ఇక్కడ ఉంటారని.. రోజులో ఏ సమయంలోనైనా వీధి ఆహారం కావాలా? అది ఇక్కడ ఉంటుందని గబ్రూజీ చెప్పకొచ్చారు. గబ్రూజీ వీడియోను చూసిన నెటిజన్లు మీరు ఇండియాను వీడి వెళ్లొచ్చు.. కానీ ఇండియా మిమ్మల్ని వీడి వెళ్లదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇండియాను మిస్ అవుతా.. అమెరికా వ్లాగర్ భావోద్వేగం
భారత పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తూ అమెరికా బ్లాగర్ ‘గబ్రూజీ’ ఎమోషనల్ అయ్యారు. బైక్‌పై ప్రయాణిస్తూ రికార్డ్ చేసిన వీడియోలో.. ‘మోదీ గారూ.. నాకూ ఆధార్ కార్డు తీసుకోవాలని ఉంది. ఇక్కడి ప్రతి విషయం నా మనసుకు హత్తుకుంది. థ్యాంక్యూ… pic.twitter.com/Mdbyz2DfhX
— ChotaNews App (@ChotaNewsApp) December 30, 2025
ఇవి కూడా చదవండి :
Maharashtra | పుణె కార్పొరేషన్ ఎన్నికల్లో పవార్లతో షిండే కూటమి?
Uttar Pradesh : నడుస్తున్న రైలు కింద పడుకుని రీల్స్ ..పోలీసుల ఎంట్రీ!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram