Uttar Pradesh : నడుస్తున్న రైలు కింద పడుకుని రీల్స్ ..పోలీసుల ఎంట్రీ!
వేగంగా దూసుకొచ్చే రైలుకింద పడుకుని రీల్ తీసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రీల్స్ కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దని హెచ్చరిక.
విధాత : సెల్ఫీ వీడియోలు..రీల్స్ పిచ్చి యువత ప్రాణాలు హరిస్తున్నా..ఇంకా వాటికి దూరంగా ఉండలేకపోతున్నారు. ఓ రకంగా కొందరికి రీల్స్..సెల్ఫీ వీడియోలు వ్యసనంగా..పిచ్చిగా మారిపోయాయి.
యూపీలో రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్స్ చేసిన అజయ్ రాజ్‌బర్ అనే యువకుడికి పోలీసులు గట్టి గుణపాఠం చెప్పారు.
వేగంగా వస్తున్న రైలుకింద పడుకుని సెల్ ఫోన్ తో వీడియో రికార్డ్ చేసిన అతడ.. ఆతర్వాత ఇతరులకు హితోపదేశం చేశాడు. తాను చేసినట్లుగా మరెవరూ కూడా ఇలాంటి దుస్సాహసం చేయవద్దని..వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి సంకెళ్లు వేశారు. కేసు నమోదు చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి పిచ్చివేషాలు వేయవద్దని, చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
గత ఏప్రిలో నెలలో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాకు చెందిన రంజిత్ చౌరాసియా అనే ఓ యువకుడు కూడాకు సుంభి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడుకొని వీడియో రికార్డ్ చేశాడు. ఇన్‌స్టాలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి రీల్ చేశాడు. తాను తీసిన వీడియోను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు. వీడియోతో అతను నిజంగానే ఫేమస్ అయినప్పటికి ..ఈ వీడియో కాస్తా వైరల్ అయి పోలీసుల వరకు వెళ్లడంతో సీన్ రివర్స్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇప్పుడు అదే పరిస్థితి అజయ్ రాజ్ బర్ కు ఎదురైంది. అందుకే ఇకముందు ఎవరు కూడా ఇలాంటి రీల్స్ వేషాలు వేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
INSV Kaundinya : వండర్..ఆ ప్రాచీన నౌక మళ్లీ సముద్రంపై ప్రత్యక్షం
Celebrities Breakups 2025 | తమన్నా నుంచి స్మృతి మంధాన వరకు.. 2025లో జరిగిన సెలబ్రిటీ బ్రేకప్స్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram