Mass Copying | షాకింగ్‌.. పిల్ల‌లు ప‌రీక్ష రాస్తుంటే.. త‌ల్లిదండ్రులు చిట్టీలు అందించారు

మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పిల్ల‌లు ప‌రీక్ష‌లు (exams) రాస్తుంటే వారి త‌ల్లిదండ్రులు ఆన్స‌ర్ చిట్టీలు (Mass Copying) అందించారు. ఈ దృశ్యాలు డ్రోన్ కెమెరాలో (drone camera) రికార్డ‌య్యాయి.

Mass Copying | షాకింగ్‌.. పిల్ల‌లు ప‌రీక్ష రాస్తుంటే.. త‌ల్లిదండ్రులు చిట్టీలు అందించారు

Mass Copying | పరీక్షల్లో (exams) విద్యార్థులు కాపీయింగ్‌కు (Mass Copying) పాల్ప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణ‌మే. అలాంటి వాటిని ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు ప్రోత్స‌హించ‌రు. విద్యార్థుల‌ను మంద‌లిస్తుంటారు. కానీ త‌ల్లిదండ్రులే (Parents) విద్యార్థుల‌కు చిట్టీలు అందిస్తూ అడ్డంగా దొరికిపోయారు. మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. బీడ్ (Beed) జిల్లాలోని చౌసాలా (Chousala) ప్రాంతంలో గ‌ల ఓ జూనియర్ కళాశాలలో మంగళవారం 12వ తరగతి (HSC) ఇంగ్లీష్ పరీక్ష జరుగుతోంది. విద్యార్థులు ప‌రీక్ష రాస్తుంటే.. త‌ల్లిదండ్రులు త‌ర‌గ‌తి గ‌దుల వెనుక‌వైపు కిటికీల్లోంచి త‌మ పిల్ల‌ల‌కు ఆన్స‌ర్ చిట్టీల‌ను అందించారు. ఇలా ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఓ గుంపే కిటికీల‌కు వేలాడుతూ చిట్టీలు అందించ‌సాగారు.

పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి విద్యాశాఖ అధికారులు క‌ళాశాల చుట్టూ నిఘా కోసం డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ విష‌యం తెలియ‌ని త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు చిట్టీలు ఇస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. వారు కిటికీల‌కు వేలాడుతూ.. క్లాస్ రూమ్‌లోని పిల్ల‌ల‌కు చిట్టీలు ఇవ్వ‌డం ఆ డ్రోన్ కెమెరాల్లో (drone camera) రికార్డైంది. చివ‌రికి డ్రోన్ల‌ను గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు అక్క‌డి నుంచి ప‌రుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రోవైపు త‌ల్లిదండ్రుల తీరుపై జిల్లా విద్యాశాఖ అధికారులు సీరియ‌స్ అయ్యారు. పిల్ల‌ల‌కు మంచి బుద్ధులు చెప్పాల్సింది పోయి.. వారిని చెడు మార్గంలో వెళ్లేందుకు ప్రోత్స‌హిస్తున్నారా..? అంటూ మండిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఇక ఈ కాపీయింగ్ వ్య‌వ‌హారం స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

ఇవి కూడా చదవండి :

Flyovers at IIIT Junction | ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద మూడు ఫ్లైవోవర్లు.. ఐటీ కారిడార్‌కు బిగ్‌ రిలీఫ్‌
Scooty | స్కూటీ ముందు భాగంలో పిల్లల్ని నిల్చోబెడుతున్నారా.. ? త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. వీడియో చూడండి