Illegal Aadhaar Centers : అనధికార ఆధార్ సెంటర్లపై అధికారుల దాడులు!
తెలుగు రాష్ట్రాల్లో అనధికార ఆధార్ కేంద్రాలపై అధికారులు దాడులు చేపట్టారు. తప్పుడు ఆధార్ నమోదు, అధిక వసూళ్లపై చర్యలు తీసుకుంటూ నెట్ సెంటర్లను సీజ్ చేస్తున్నారు.
విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో అనధికార ఆధార్ కేంద్రాలపై అధికారులు దాడులు చేపట్టారు. వారి లాగిన్స్ వివరాలను విచారిస్తున్నారు. ఇటీవల పలు గ్రామ పంచాయతీలు, ఆధార్ కేంద్రాల ద్వారా తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ లు జారీ అయినట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే నెట్ సెంటర్ పేరుతో ప్రజల నుంచి అధిక మొత్తంలో ఆధార్ కేంద్రాల నిర్వాహకులు దోపిడి చేస్తున్నారు. దీంతో అనధికార ఆధార కేంద్రాల, నెట్ సెంటర్ల ఆట కట్టించాలని అధికారులు దాడులు చేపట్టారు. ప్రజలు కూడా అనధికార నెట్ సెంటర్లకు వెళ్లి మోసపోవద్దంటూ అధికారులు సూచిస్తున్నారు.
వాస్తవానికి ఇప్పుడు బయట ఎక్కడా ఆధార్ నమోదు కేంద్రాలు లేవు. కేవలం బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లల్లో మాత్రమే ఆధార కేంద్రాలను అనుమతించారు. ఈ నేపథ్యంలో అనుమతి లేని అనధికార ఆధార్ కేంద్రాలను గుర్తించి సీజ్ చెయ్యాలని ఇప్పటికే పలు తహశీల్దార్, కమిషనర్ లకు ఆదేశాలు జారీ అయినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అనధికా ఆధార్ కేంద్రాలు, నెట్ సెంటర్లపై అధికారుల బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల కింద లబ్ధి పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు అందరికీ, అన్ని రకాల సేవలకూ ఆధార్ కార్డు అనివార్యమవుతోంది. బ్యాంకు ఖాతాలు, రైతు గుర్తింపు సంఖ్య నమోదు, పింఛన్లు, రేషన్‌కార్డుల మంజూరు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంటు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, గ్యాస్ కనెక్షన్, రైతుభరోసా, బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం ఆర్థిక సహాయం తదితరాలన్నింటికీ ఆధార్ కార్డును తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుల జారీ, ఇది వరకే ఉన్న కార్డుల్లోని తప్పుల సవరణ, వేలిముద్రలు, కార్డుల నవీకరణ, మొబైల్ నంబర్ అప్డేట్, పేర్లు, ఇంటి నంబర్ల మార్పు వంటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదే అదనుగా ఆధార్ కేంద్రాల నిర్వాహకులు, నెట్ సెంటర్ల వారు అక్రమాలకు పాల్పడుతుండటంతో అనధికార ఆధార్ కేంద్రాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు త్వరలో కేంద్రం, ఉదయ్ క్యూఆర్ కోడ్, ఫొటో మాత్రమే ఉండేలా కొత్త యాప్ తీసుకురానుంది. ఇందుకోసం ‘ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్’ అనే సరికొత్త టెక్నాలజీని వాడనున్నారు.
ఇవి కూడా చదవండి :
Viksit Bharat Shiksha Adhikshan : ప్రైవేటు విద్యా సంస్థల మూకుతాడుకు
Mega Treat | మెగా ఫ్యాన్స్‌కు నేడు డబుల్ ట్రీట్.. చిరు, పవన్ సినిమాల నుంచి సాయంత్రం 5 తర్వాత కీలక అప్డేట్స్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram