Hyundai Verna | హ్యుందయ్ వెర్నా 2026 మోడల్ వచ్చేసింది.. కొత్తగా వచ్చిన ఫీచర్లు, హైసెక్యూరిటీ వివరాలివే!

Hyundai Verna | హ్యుందాయ్ నుంచి వెర్నా 2026 మోడల్ కొత్తగా మార్కెట్‌లోకి వచ్చింది. ప్రారంభ ధర రూ.10.98 లక్షలతో వచ్చిన ఈ సెడాన్ కారు అనేక కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అయ్యింది. ఈ కారు హోండా సిటీ, ఫోక్స్‌వేగన్ వెర్టస్, స్కోడా స్లావియాకి గట్టి పోటీనిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • By: Chandram |    news |    Published on : Mar 10, 2026 9:14 PM IST
Hyundai Verna | హ్యుందయ్ వెర్నా 2026 మోడల్ వచ్చేసింది.. కొత్తగా వచ్చిన ఫీచర్లు, హైసెక్యూరిటీ వివరాలివే!

Hyundai Verna | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ తన ప్రీమియం సెడాన్ వెర్నాకు 2026 మోడల్ అప్‌డేట్ తీసుకొచ్చింది. కొత్త Hyundai Verna 2026 మోడల్‌ను రూ.10.98 లక్షలు (ఎక్స్ షోరూం ధర) ప్రారంభ ధరగా నిర్ణయించారు. మొత్తం ఆరు వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. వీటిలో హైఎండ్ కారు ధర రూ.18.25 లక్షల వరకూ ఉంది. అప్‌డేటెడ్ ఫీచర్లతో వచ్చిన ఈ కారు హోండా సిటీ, ఫోక్స్‌వేగన్ వెర్టస్, స్కోడా స్లావియాకి గట్టి పోటీనిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త ఫీచర్ల అప్‌డేట్‌తో పాటు వేర్నా వేరియంట్ పేర్లను కూడా హ్యుందాయ్ సవరించింది. వెన్యూ కారు వేరియంట్‌ను పోలినట్లుగా వీటిని తీసుకొచ్చింది. కొత్త వెర్నా 2026 మోడల్‌లో HX2, HX4, HX6, HX6+, HX8, HX10 వేరియంట్లు ఉన్నాయి. ఇక పాత మోడల్ ప్రారంభ ధర రూ.10.79 లక్షలు కాగా, కొత్త మోడల్‌లో దాని ధర రూ.18,900 అధికంగా ఉండటం గమనార్హం.

డిజైన్‌లో మార్పు లేదు

వెర్నా 2026 మోడల్‌కు సంబంధించి డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కాకపోతే కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్ ఇచ్చారు. కారు ముందు భాగంలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ హౌసింగ్‌ను రూపొందించారు. అలాగే ఎల్‌ఈడీ ఇండికేటర్లు, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్‌నున ఇచ్చింది. సైడ్ ప్రొఫైల్‌లో 16 అంగుళాల డ్యుయెల్ టోన్ అలాయ్ వీల్స్‌ ఉన్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, వెర్నా లెటరింగ్ కొనసాగుతుంది.

సైజ్ పెరిగింది.. కొత్తగా రెండు కలర్లు వచ్చాయి

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్‌ కారు పొడవు 30 మిల్లీమీటర్ల వరకు పెరిగింది. పాత వాటితో పోలిస్తే 2026 మోడల్‌లో రెండు కొత్త కలర్ ఆప్షన్స్‌ను హ్యుందాయ్ ఇచ్చింది. క్లాసీ బ్లూ, టైటాన్ గ్రే ( మ్యాట్ ఫినిష్) కలర్లను అదనంగా జోడించింది. ఇవి కాకుండా ఇప్పటికే ఉన్న స్టారీ నైట్, అట్లాస్ వైట్, అబీస్ బ్లాక్ రంగులు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇంటీరియర్‌లో మార్పులివే

కారు ఇంటీరియర్‌లో బ్లాక్ వైట్ క్యాబిన్ థీమ్ అలాగే ఉంది. అయితే స్టీరింగ్ వీల్‌పై కొత్త మోర్స్ కోడ్ హ్యుందాయ్ లోగోను ఇచ్చారు. అలాగే మెమొరీ ఫంక్షన్‌తో 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఏర్పాటు చేశారు. కొత్తగా ప్యాసింజర్ సీటుకు బాస్ మోడ్ ఫంక్షనాలిటీ ఇచ్చారు. ప్యాసింజర్ సీటుకు పవర్ అడ్జస్టబుల్‌తో వస్తుంది. ఇవికాకుండా ఇప్పటికే ఉన్న వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆంబియంట్ లైటింగ్, ఆటో ఈసీ ఫీచర్లు కొనసాగుతాయి.

సెక్యూరిటీలోనూ..!

ఇక భద్రతాపరంగా కూడా 2026 మోడల్‌లో పలు అప్‌డేట్స్ ఇచ్చారు. టాప్ మోడల్ కారులో గతంలో ఆరు ఎయిర్‌బ్యాగులు ఉండగా.. ఇప్పుడు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లను ఇస్తుంది. దీనితో పాటు 360 డిగ్రీల ఇన్‌బిల్ట్ డ్యాష్‌ క్యామ్, బ్లైండ్‌స్పాట్ మానిటర్ అందిస్తుంది. ఒక కొత్త వెర్నా ఇంజిన్ ఎంపికలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

Read More:

తన నవ్వుతో సోషల్‌‌మీడియాను ఊపేసిన బాలుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా!