• Telugu News
  • /National

Passport Seva | ఇంకో 4 రోజుల్లో పాస్‌పోర్ట్‌ జారీలో మార్పులు

దేశంలో పాస్‌పోర్టుల జారీలో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ భారత ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. సరళతర నిబంధనలు 2026, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలు కానున్నాయి.

Reported by: Tech | జాతీయం | Feb 11, 2026, 10:52 pm IST
Read Time: 5 mins
Passport Seva | ఇంకో 4 రోజుల్లో పాస్‌పోర్ట్‌ జారీలో మార్పులు

Simplified Digital system for Passports

Passport Seva | దేశంలో పాస్‌పోర్టుల జారీలో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ భారత ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. సరళతర నిబంధనలు 2026, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలు కానున్నాయి. సవరించిన విధానంతో పేపర్ పని తగ్గుతుందని, డిజిటల్ వెరిఫికేషన్ మూలంగా పని సులువు కానున్నదని ప్రభుత్వం చెబుతున్నది. మోసాలను అరికట్టేందుకు, వేగవంతంగా సేవలు అందించేందుకు మార్పులు తీసుకువచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. కొత్తగా దరఖాస్తు చేసేవారు, రెన్యువల్ చేసుకునేవారు తమ దరఖాస్తులు సమర్పించే ముందు వివరాలను తెలుసుకోవాలని సూచించారు.

పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్​ వల్ల పాస్​పోర్టుల సత్వర జారీకి అవకాశం కలుగుతుందని విదేశాంగ శాఖ భావిస్తోంది.

హైలైట్స్:

  • • డూప్లికేషన్ తగ్గించేందుకు, ప్రత్యక్షంగా హాజరై దరఖాస్తులు సమర్పించే విధానాన్ని తగ్గించేందుకు మార్పులు తీసుకువచ్చారు.
    • ఆధార్, ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన గుర్తింపు పత్రాలను ప్రాథమిక గుర్తింపు పత్రాలు, చిరునామా కింద పరిగణనలోకి తీసుకోనున్నారు.
    • డిజిటల్ డాక్యుమెంట్ల సమర్పణతో పాస్ పోర్టు సేవా కేంద్రాలను సందర్శించాల్సిన ఆవశ్యకత ఉండనే ఉండదు.
    • దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పత్రాల సంఖ్యను తగ్గించారు.
    • అసంపూర్తి, స్పష్టత లేకుండా దరఖాస్తులను సమర్పిస్తే కచ్చితంగా తిరస్కారానికి గురవుతాయి.
    • పాస్ పోర్టుల జారీలో పోలీసుల వెరిఫికేషన్ అతి పెద్ద సమస్యగా మారడంతో పాస్ పోర్టు కార్యాలయం, పోలీసు శాఖ మధ్య డిజిటల్ సేవలను అమలు చేయనున్నారు.
    • వారాల కొద్దీ తీసుకునే సమయాన్ని కొన్ని రోజులలోనే తనిఖీలు పూర్తి కానున్నాయి.
    • ఆన్ లైన్ డాటా కారణంగా ప్రభుత్వ విభాగాల మధ్య సత్వర పరిశీలన వేగంగా పూర్తి కానున్నది.
    • కొన్ని ఎంపిక చేసిన విభాగాలలో పోలీసు వెరిఫికేషన్ లేకుండానే పాసు పోర్టులు జారీ చేసి, ఆ తరువాత వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
    • దరఖాస్తుదారులకు సులువురు అర్థమయ్యేలా, పారదర్శకంగా ఉండేలా పాస్ పోర్టు వెబ్ ఫోర్టల్ ను రూపొందించారు.
    • పూర్తిగా ఆన్ లైన్ లోనే డాక్యుమెంట్లను సమర్పించే విధంగా తీర్చిదిద్దారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అప్పాయింట్ మెంట్లు లభించనున్నాయి.
    • సమర్పించిన దరఖాస్తు ఏ స్టేజిలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, ఆ సమాచారం వెంట వెంట పొందవచ్చు.

చిన్నారులు కూడా డిజిటల్ బర్త్ సర్టిఫికెట్లు, స్కూల్ గుర్తింపు కార్డులు జతపరిచి దరఖాస్తు చేస్తే సత్వరమే పాస్ పోర్టు జారీ చేయనున్నారు. సంరక్షకుల ఆమోద పత్రంలో కూడా సంస్కరణలు తీసుకువచ్చారు. పాస్ పోర్టు కేంద్రాలను చిన్న చిన్న నగరాలు, మండల కేంద్రాలకు విస్తరించనున్నారు. మారిన నిబంధనలు ఒకసారి పాస్ పోర్టు వెబ్ ఫోర్టల్ లో అధ్యయనం చేసి ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రజలను కోరుతోంది.