Site icon vidhaatha

Rasi Phalalu | శుక్ర‌వారం, మార్చి14..హోలీ రోజున మీ రాశి ఫలాలు! వారికి ప‌ట్టింద‌ల్లా బంగారం

Rasi Phalalu|

జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం ఉంది. లేచినప్ప‌టి నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం.అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద ఈ రోజు శివ‌రాత్రి (శుక్ర‌వారం, మార్చి 14) న‌ మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం
వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త. రాజకీయ నాయకుల ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు. సామాజిక కార్యక్రమాలలో ముందుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీకు ప్రత్యేక ప్రాధాన్యం. బంధుమిత్రుల కలయికలు లాభిస్తాయి. ప్రముఖ వ్యక్తులతో కలయికలు సంతోషాన్ని కలిగిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి. సొంత పనులపై శ్రద్ద ఉంచాలి.

వృషభం
ఆర్థిక సమస్యల నుంచి విముక్తి. ఉద్యోగ మూలకంగా అశాంతి కలుగవచ్చును. దూర ప్రాంతాలకు వెళ్లడం వలన అసౌకర్యం. సంతృప్తికరంగా వృత్తి జీవితం. తండ్రి వర్గం వారితో విభేదాలు వచ్చే అవకాశమున్నది. దగ్గర బంధువుల నుంచి ఆశించిన సమాచారం. ప్రయత్నం కార్యములు ఆలస్యం కావచ్చును. వృథా ఖర్చులకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగును.

మిథునం
పిల్లల నుంచి శుభవార్త వింటారు. దాచుకున్న ధ‌నం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తొందరపాటు పనికిరాదు. మనసులో తెలియని ఆందోళన కలిగే అవకాశమున్నది. ప్రముఖులతో పరిచయాలు. భోజన నియమాలు పాటించండి. ధన వ్యయం కలగవచ్చును. ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు.

కర్కాటకం
సానుకూలంగా కుటుంబ జీవితం. స్థిరాస్థి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆహార, విహారాల విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. సత్ప్రవర్తనతో గౌరవాన్ని పొందుతారు. లాభదాయకమైన కొత్త స్నేహాలు వ‌స్తాయి. బంధువుల నుంచి రావలసిన ధనం చేతికందుతుంది. అనుకోని ప్రమాదాల నుండి బయటపడతారు. ఉత్సాహంగా వ్యాపారాలు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం.

సింహం
వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరుగుతుంది. మనసును కదిలించే మాటలను వింటారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం. పుణ్యక్షేత్ర సందర్శనం సంతోషాన్నిస్తోంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు. స‌మాజంలో తగిన గౌరవం పొందుతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ధన ప్రాప్తి సంతోషం కలిగిస్తుంది. ప్రతి పనిలో వ్యయ ప్రయాసలు.

కన్య
సకాలంలో ముఖ్య పనులు పూర్తి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం. సాఫీగా ఉద్యోగ జీవితం. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. శత్రువులు మిత్రులవుతారు.ఆశాజనకంగా ఆర్థిక వ్యవహారాలు. క్రీడాకారులకు విజయాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి .వైద్య రంగంలో వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు.

తుల
ఆదాయానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయవలసి వస్తుంది, కనుక జాగ్రత్త వహించండి. వ్యాపారంలో కొత్త పుంతలు. ప్రయాణం వ‌ల‌న‌ అశాంతి కలగవచ్చు. వాహన మూలకంగా వ్యయం చేయవలసి వస్తుంది. సమర్థతకు ఆశించిన గుర్తింపు. భయం వదలండి లేకుంటే పనులు ముందుకు సాగవు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృశ్చికం
లాభసాటిగా వ్యాపారాలు. జీవిత భాగస్వాములతో కఠినంగా వ్యవహరించకండి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి. సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. నిలకడగా ఆరోగ్యం. ఆకస్మిక ధన లాభం కలుగవచ్చును. వృత్తి ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడడం తగ్గించండి. శుభం కలుగుతుంది. ధనపరంగా మాట ఇచ్చి ఇబ్బంది ప‌డుతారు. అవనసర ఖర్చులు తప్పవు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.

ధనుస్సు
వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం. బంగారు వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం. కోర్టు వ్యవహారాలలో విజయం లభించవచ్చు. నష్టపోయిన చోటనే తిరిగి లాభం పొందే అవకాశమున్నది. జీతభత్యాల విష‌యంలో మంచి వార్త వింటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది.ముఖ్య వ్యవహారాలు పూర్తవుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు.

మకరం
వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గట్టుగా లాభాలు. మంచి వ్యక్తులను కలియటం వలన ఆనందాన్ని పొందుతారు. హ్యాపీగా కుటుంబ జీవితం. దానధర్మాది మంచి కార్యములను చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి. బహుమానములను పొందుతారు. భోజన సౌఖ్యం కలుగుతుంది.గృహ, వాహన ప్రయత్నాల్లో ఇబ్బందులు. ఇంటా బయటా పని భారం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు.

కుంభం
కుటుంబ సభ్యుల విష‌యంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణంలో మూలకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు. చేయవలసిన పనులను వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. బంధు, మిత్రుల విరోధములు బాధించవచ్చును. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులతో ఫ‌లితాలు. వివాహ ప్రయత్నంలో నెమ్మదిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.

మీనం
ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ధన ధాన్య లాభములు కలగవచ్చును. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు. భూములు క్రయవిక్రయముల వలన లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మాట్లాడేటప్పుడు సమయమనం పాటించండి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు. ఇంట్లో శుభములు కలుగును కలుగవచ్చును. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపు.అదనపు ఆదాయం ఉంటుంది. వృథా ఖర్చులు అధికం.

Exit mobile version