DIGITAL GOLD INVESTMENT: డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్‌పై చేతులెత్తేసిన SEBI!

బంగారంపై పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలనుకునేవారు డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా పుత్తడిపై పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నటువంటి డిజిటల్ గోల్డ్ పథకాలపై మార్కెట్ నియంత్రన సంస్థ SEBI పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది.

విధాత: బంగారం ధరలు ఈ ఏడాది ఏ విధంగా పెరిగాయో తెలిసిందే.. రోజు రోజుకూ వేలకు వేలు పెరుగుతూ మధ్యతరగతి వారిని కలవరపెట్టింది. కేవలం ఈ ఏడాదిలోనే పసిడి ధరలు పరుగులు పెట్టి సుమారు 50 శాతం పెరిగింది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలనుకునేవారు డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా పుత్తడిపై పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నటువంటి డిజిటల్ గోల్డ్ పథకాలపై మార్కెట్ నియంత్రన సంస్థ SEBI పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది.

ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మదుపరులకు ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేసింది. డిజిటల్ గోల్డ్ లేదా వేరే ఈ-గోల్డ్ స్కీమ్స్ కమొడిటీ డెరివేటివ్ పరిధిలో లేవు దీంతో SEBI పరిధిలోకి రావని వెల్లడించింది. ఏదైనా కారణాలతో డిజిటల్ గోల్డ్ అందిస్తున్న సంస్థలు, లేదా యాప్‌లు మూతపడితే, దివాలా తీస్తే పెట్టుబడిదారుల సొమ్ముకు నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అప్పుడు ఏం చేయలేమని పేర్కొంది.

అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు SEBI పరిధిలో ఉన్న కొన్ని మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. అందుకోసం (GOLD ETF), GOLD FUNDS, ఎక్స్చేంజస్ ట్రేడెడ్ డెరివేటివ్స్ వంటివి అందుబాటులో ఉన్నాయని తెలిపింది.