Gold | బంగారం ధరలు( Gold Rates ) భగ్గుమంటున్నప్పటికీ.. పసిడి కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి. తులం కొనలేకున్నా.. గ్రాము బంగారమైన కొని పసిడి లవర్స్( Gold Lovers ) సంతోషపడుతున్నారు. కొందరు తులాలకు తులాలు బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇలాంటి తమ బంగారాన్ని( Gold ), ఆభరణాలను సురక్షితంగా ఉంచడానికి బ్యాంకు లాకర్ల( Bank Lockers )ను ఆశ్రయిస్తుంటారు. కొందరైతే తమ ఇండ్లలోనే పసిడిని దాచుకుంటున్నారు. మరి ఇంట్లో అయితే ఎంత వరకు బంగారం దాచుకోవచ్చు.. బ్యాంకు లాకర్లలో ఎంత వరకు భద్రపరుచుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు?
ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్( Income Tax Act ) ప్రకారం.. ఇంట్లో ఉంచుకునే బంగారానికి రకరకాల పరిమితులు ఉన్నాయి. వివాహిత స్త్రీలకు, అవివాహిత మహిళలకు, పురుషులకు వేర్వేరుగా నిబంధనలు ఉన్నాయి. వివాహిత మహిళ 500 గ్రాముల వరకు బంగారం దాచుకోవచ్చు. అదే అవివాహిత మహిళలు అయితే 250 గ్రాముల వరకే ఉంచుకోవచ్చని చట్టం చెబుతుంది. పురుషులు అయితే తమ పేరు మీద 100 గ్రాముల బంగారం వరకు ఉంచుకోవచ్చు.
భార్యాభర్తల విషయానికి వస్తే..
ఇక భార్యాభర్తల విషయానికి వస్తే.. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటే.. వారి వద్ద మొత్తం 600 గ్రాముల బంగారం వరకు నిల్వ చేసుకోవచ్చు. అంటే భర్త 100 గ్రాములు, భార్య 500 గ్రాముల వరకు పసిడి ఉంచుకునేందుకు వీలుంది. అదే అవివాహిత, పురుషుడు ఇంట్లో ఉంటే వారి వద్ద కేవలం 350 గ్రాముల వరకే గోల్డ్ ఉండాలి. అవివాహిత మహిళలు 250 గ్రాములు, పురుషుడు 100 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు.
మరి బ్యాంకు లాకర్లలో బంగారం ఉంచేందుకు నిబంధనలు ఏంటి..?
ఆర్బీఐ( RBI ) నిబంధనల ప్రకారం.. బ్యాంకు లాకర్లలో బంగారం ఉంచేందుకు గరిష్ట పరిమితులు లేవు. కానీ బ్యాంకు లాకర్లలో బంగారం ఉంచాలంటే.. కొనుగోలు చేసిన ఆధారాలు తప్పనిసరిగా చూపించాలి. తమ లాకర్లలో ఎంత బంగారం ఉంచుతున్నారనేది ఆయా బ్యాంకుల విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఒక కస్టమర్ తన బ్యాంక్ లాకర్లలో ఎంత బంగారం ఉంచుకోవాలనుకుంటున్నారో అది వారి ఇష్టం.
