Gold Rates | బంగారం ధరలు( Gold Rates ) భగ్గుమంటున్నాయి. పసిడి ధరలు ఇవాళ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. భారీగా ధరలు పెరిగి పోవడంతో బంగారం ప్రియులు( Gold Lovers ) బెంబేలెత్తిపోతున్నారు. అసలు బంగారం కొనగలమా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తూ పోవడం కూడా పసిడి పెరుగుదలకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది.
అయితే గత నెలలో బంగారం ధరలు పరిశీలిస్తే.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇక దసరా వేళ బంగారం ధరలు తగ్గుతాయని భావించిన వారికి అక్టోబర్ 1వ తేదీన కూడా నిరాశే ఎదురయింది. దీంతో పసిడి కొనుగోలును వారు వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
అక్టోబర్ 1, బుధవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర ఏకంగా రూ.120 పెరిగి రూ.11,864 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 10,875 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8,898 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,000 పెరిగి రూ. రూ.11,86,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 10,87,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.8,89,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,750 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.88,980 గా నమోదైంది.