Gold Rates | రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న బంగారం ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో తులం రూ. ల‌క్షా 29 వేలు

గ‌త ప‌ది రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు( Gold Rates ) భ‌గ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో ప‌సిడి ధ‌ర‌లు పరుగులు పెడుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా బంగారం ధ‌ర‌లు పెరిగిపోతూ... ప‌సిడి ప్రియుల‌కు( Gold Lovers ) చుక్క‌లు చూపిస్తున్నాయి. బుధ‌వారం కూడా బంగారం ధ‌ర‌లు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి.

Gold Rates | హైద‌రాబాద్ : గ‌త ప‌ది రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు( Gold Rates ) భ‌గ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో ప‌సిడి ధ‌ర‌లు పరుగులు పెడుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా బంగారం ధ‌ర‌లు పెరిగిపోతూ… ప‌సిడి ప్రియుల‌కు( Gold Lovers ) చుక్క‌లు చూపిస్తున్నాయి. బుధ‌వారం కూడా బంగారం ధ‌ర‌లు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి.

బులియ‌న్ మార్కెట్‌( Bullion Market )లో నేడు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ. 12,889 కాగా, ఒక గ్రాము 22 క్యారెట్ల ధ‌ర రూ. 11,815గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1,28,890గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1,18,150గా ట్రేడ్ అవుతోంది. అంటే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 540 పెర‌గ్గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 500 ఎగ‌బాకింది.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1,28,890 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1,18,150గా న‌మోదైంది. అయితే పెట్టుబ‌డిదారులు సుర‌క్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండ‌డంతో బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చిన‌ట్లు బులియ‌న్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడి ధ‌ర‌లు పరుగులు పెట్ట‌డానికి అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు కూడా కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు కూడా చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా పెరిగాయి. గ‌త ప‌ది రోజుల నుంచి వెండి ధ‌ర‌లు కూడా ఆకాశాన్నంటాయి. కిలో వెండి రూ. 1,90,000గా ట్రేడ్ అవుతోంది. హైద‌రాబాద్ మార్కెట్‌లో అయితే కిలో వెండి ధ‌ర రూ. 2,07,000గా ఉంది.