Site icon vidhaatha

Singer Suchitra: గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు

విధాత‌: స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవ‌ల‌ వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. ధనుష్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేప‌గా ప‌లువురు అమెకు మ‌ద్ద‌తు తెలుప‌గా విమ‌ర్శ‌లు అంత‌కుమించి అనే స్థాయిలో వ‌చ్చాయి. ప్ర‌స్తుతం న‌య‌న‌తార‌, ధ‌నుష్‌ల మధ్య వివాదం కోర్టులో ఉండ‌గా న‌య‌న‌తార నుంచి జ‌వాబు రావాల్సి ఉంది.

అయితే రీసెంట్‌గా ప్రముఖ సింగర్, నిత్యం ఆర్టిస్టుల‌పై ఆరోప‌ణ‌లు చేసే సుచిత్ర ఇటీవ‌ల‌ నయనతారపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో తాను నటించిన చిత్రాల కంటే కొత్త‌గా విడుద‌లైన తన డాక్యుమెంట‌రీని ప్రేక్షకులు అధికంగా చూశారని న‌య‌న‌తార పేర్కొనడం తన అహంకారానికి నిద‌ర్శ‌ణ‌మ‌ని బూతులు తిట్టేసింది.

డబ్బులున్నాయి కదా.. నేను ఏమన్నా చెల్లుతుందని అనుకుంటే పొరపాటని ఆమె గతంలో ఎలా ఉందనే విష‌యాన్ని మాత్రం మర్చిపోవద్దు, తప్పు ఎవరు చేస్తున్నారో ఆలోచించడం మంచిదని సుచిత్ర హితవు పలికింది. గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదని ఇండైరెక్ట్ గా చివాట్లు పెట్టింది. దీనిపై నయనతార ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Exit mobile version