విధాత : జేజమ్మ అనుష్క నటించిన అరుంధతి సినిమాలో ఆమె తలపై కొబ్బరి కాయలు కొట్టిన సీన్ చూసిన ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. అచ్చం అలాంటి సంఘటనే నిజ జీవితంలోనూ ఓ గ్రామంలో కొనసాగుతుండటం విస్మయం రేపుతుంది. తమిళనాడులోని కరూర్ జిల్లా మెట్టు మహదానపురంలోని సుమారు 400 ఏళ్ల నాటి పురాతనమైన అరుళ్‌మిగు మహాలక్ష్మి ఆలయంలో ఈ వింత ఆచారం కొనసాగుతుంది. ఏటా ఆడి మాసంలో వందలాది మంది భక్తులు 18 రోజులు దీక్ష చేపట్టి 19వ రోజు తలపై కొబ్బరికాయలు కొట్టించుకుని మొక్కు తీర్చుకోవడం భక్తుల ఆనవాయితీ. తాజాగా ఒక మహిళ తన దీక్షలో భాగంగా తలపై కొబ్బరికాయలు కొట్టించుకునే ఆచారం పాటించింది. అక్కడి ఆలయ పూజారి కొబ్బరికాయలు కొట్టే వింత ఆచారం నిర్వహించారు. తలపై కొట్టిన కొబ్బరికాయ పగిలితేనే మొక్కు తీరినట్టు భక్తులు భావిస్తారు
మహిళ తల నుంచి రక్తం కారుతున్నా.. ఆపకుండా పూజారి..కొబ్బరి కాయలు కొట్టాడు. అక్కడే ఉన్న భక్త జనం చప్పట్లు కొడుతూ దైవ స్మరణ చేస్తూ చూస్తుండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆచారం పేరుతో ఇలాంటి అరాచకాలు కొనసాగుతుండటం పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. రాకెట్ యుగంలో..ఏఐ కాలంలో మధ్యయుగాల నాటి మూఢ నమ్మకాలు ఇంకా కొనసాగడం అనాగరీకమంటూ మండిపడుతున్నారు.
#ViralVideo || అరుంధతి సినిమా తరహాలో.. ఒక మహిళ తలపై కొబ్బరికాయలు కొట్టిన పూజారి.!
తమిళనాడు లోని మెట్టు మహదానపురంలోని మహాలక్ష్మి ఆలయంలో వింత ఆచారం..
తల నుంచి రక్తం కారుతున్నా.. ఆపకుండా కొబ్బరి కాయలు కొడుతున్న పూజారి..
ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆచారం పేరుతో… pic.twitter.com/ssNAE3rhJG
— Telugu Reporter (@TeluguReporter_) October 4, 2025